Health Benefits : సెగ గడ్డలు, గుల్లలు రాకుండా ఉండాలంటే.. ఇవి పాటించాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : సెగ గడ్డలు, గుల్లలు రాకుండా ఉండాలంటే.. ఇవి పాటించాల్సిందే!

Health Benefits : చాలా మందికి చర్మం మీద అక్కడక్కడా గుల్లలు వస్తాయి. చిన్న బఠాణీ గింజలంత గడ్డలు, కురుపులు ఉంటాయి. ఇలాంటి గుల్లలు వస్తే వీటిని వేడి కురుపులు, సెగ గడ్డలు అంటారు. అది కొంచెం ఎర్రగా మారి నొప్పి వస్తుంది. కొన్ని రోజులకు క్కడ తగ్గి ఇంకో చోటు వస్తుంటుంది. అవి రెండు, మూడు నెలలకు మచ్చలుగా మారుతాయి. ఇవి ఎక్కువగా పిరుదులు, వీపు, ముఖం మీద వస్తుంటాయి. ఇలాంటి గుల్లలు వేడి చేస్తే […]

 Authored By pavan | The Telugu News | Updated on :25 April 2022,2:00 pm

Health Benefits : చాలా మందికి చర్మం మీద అక్కడక్కడా గుల్లలు వస్తాయి. చిన్న బఠాణీ గింజలంత గడ్డలు, కురుపులు ఉంటాయి. ఇలాంటి గుల్లలు వస్తే వీటిని వేడి కురుపులు, సెగ గడ్డలు అంటారు. అది కొంచెం ఎర్రగా మారి నొప్పి వస్తుంది. కొన్ని రోజులకు క్కడ తగ్గి ఇంకో చోటు వస్తుంటుంది. అవి రెండు, మూడు నెలలకు మచ్చలుగా మారుతాయి. ఇవి ఎక్కువగా పిరుదులు, వీపు, ముఖం మీద వస్తుంటాయి. ఇలాంటి గుల్లలు వేడి చేస్తే వస్తుంటాయి అంటారు. అది నిజమేనా… అసలు ఇవి ఎందుకు, ఎలా వస్తాయి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వ కాలం నుంచి మన పెద్దలు అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలని పచ్చళ్లు, మసాలాలు తింటే వేడి చేస్తుందని అనేవారు. నిజానికి అలా చెప్తే వింటారని మాత్రమే. అయితే అది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. గుల్లల్లో ఉండే చీము బయటకు రావడానికి అది గడ్డలా తయారవుతుంది. కానీ వేడి వల్ల కాదు. ఇలా సెగ కరుపులు, సెగ గడ్డలు లేదా చర్మంపై ఏర్పడే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి రోజూ హనీ, లెమన్ వాటర్ రోజుకు ఐదారు సార్లు తాగాలి. నాలుగైదు స్పూన్ల తేనె, అర చెక్క నిమ్మరసం కలపాలి. రోజుకు నాలుగు లీటర్ల మంచి నీళ్లు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న టాక్సిన్లు, విష వ్యర్థాలు బయటకు పోతాయి. తేనె తాగడం వల్ల వేడి చేయదు. నీళ్ల తాగకపోవడం వల్ల ఏర్పడే ఇబ్బంది అది.

amazing Health Benefits for pus boils

amazing Health Benefits for pus boils

రోజుకు రెండు బోండాల కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. జ్యూస్, కూరగాయల రసాలన్నీ ఎక్కువగా తీసుకోండి. అలా చేయడం వల్ల రక్త శుద్ధి జరిగి బాక్టీరియా ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పండ్లు తీసుకోవడం వల్ల బాక్టీరియా తగ్గుతుంది. రోజూ ఐదారు లీటర్ల మంచి నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల పాత గడ్డలు మళ్లీ రాకుండా చేస్తాయి. రోజుకు రెండు సార్లు విరోచనం అయ్యేలా చేస్తుంది. ఉదయాన్నే ఒక జ్యూస్ తప్పకుండా తాగండి. ఒఖ వెజిటబుల్ జ్యూస్, సాయంత్రం ఒక పండ్ల రసం తాగాలి. త్వరగా ఆహారం తీసుకోవాలి. టాక్సిన్లు పోవడం వల్ల సెగ కురుపులు రాకుండా ఉంటాయి. ఇలా రెండు మూడు నెలలు చేస్తే ఆరోగ్యంతో పాటు సెగ గడ్డలు, కురుపులు కూడా తగ్గుతాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది