Belly Fat : ఇలా చేస్తే చాలు.. 4 రోజుల్లో ఎంతటి బరువైన తగ్గడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Belly Fat : ఇలా చేస్తే చాలు.. 4 రోజుల్లో ఎంతటి బరువైన తగ్గడం ఖాయం...!
Belly Fat : ప్రస్తుతం అందరిని ఎక్కువగా వేధించే సమస్య ఊబకాయం. దీనికీ కారణం ఎక్కువగా కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్ తినడం సరైన వ్యాయామం లేకపోవడంతో పొత్తు చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పెడుతుంది. అయితే అలాంటివారు అధిక బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని ఇంట్లో అల్లం రసం నిమ్మ రసం కలిపి రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా తగితే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఉడికించిన పదార్థాలు తినడం మానేసి ఫ్రూట్స్ తినాలి.
ఫ్రూట్స్ తో ఉండలేని వారు పుల్కాలు చపాతీలు తీసుకోవచ్చు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో మొలకలు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. ఇవి బరువు తగ్గించడంతోపాటు శరీరానికి అవసరమైన విటమిన్స్ అందించి అధిక బరువు తగ్గిస్తుంది. వెజిటేబుల్ జ్యూస్ లు కూరగాయలతో చేస్తున్న సూప్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వల్ల ఆకలి తీరడంతో పాటు శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు కొబ్బరిబోండం తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం తో పాటు ఊబకాయ సమస్య నుండి బయటపడవచ్చు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో సబ్జా గింజలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పడుకునే ముందు సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి ఆ పానీయాన్ని ఉదయాన్నే తాగితే కొద్ది రోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది.
ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బయటకు వెళ్ళేటప్పుడు దూరం తక్కువ అయితే బైక్ మానేసి నడిచి వెళుతూ ఉండాలి. కీళ్ల నొప్పులు సమస్య లేనివారు లిస్ట్ వాడడం తగ్గించి మెట్ల ద్వారా పైకి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. మన మన శరీరానికి ఎనిమిది గంటలకు ఒకసారి ఆకలి అనిపిస్తుంది. ఈ సమయంలో జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా మంచి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఆహారంలో నూనె పదార్థాల వాడకాన్ని తగ్గించాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. స్వీట్లు, చాక్లెట్స్ కి దూరంగా ఉండాలి. రోజులో కొద్ది కొద్దిగా ఫ్రూట్స్, మొలకలు లాంటివి ఎక్కువసార్లు తింటూ ఉండండి ఇలా చేస్తే ఆకలి అనిపించదు..