Black Grapes : చలికాలంలో నల్ల ద్రాక్ష చేసే మేలు అంతా ఇంతా కాదు…!
ప్రధానాంశాలు:
Black Grapes : చలికాలంలో నల్ల ద్రాక్ష చేసే మేలు అంతా ఇంతా కాదు...!
Black Grapes : చలికాలంలో నల్ల ద్రాక్ష చేసే మేలు అంతా ఇంతా కాదు.నల్ల ద్రాక్ష ముఖ్యంగా చలికాలంలో శ్వాసకోశ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు నల్ల ద్రాక్ష తీసుకోవడం మంచిది. నల్ల ద్రాక్ష తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. నల్ల ద్రాక్షాలు చలికాలంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ రక్తపోటు స్థాయిలో నియంత్రణ ఉంటుంది. రాత్రిపూట ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఆ నీటిని ద్రాక్షలను తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రపడుతుంది. వీటిని రాత్రి మొత్తం నీటిలో నానబెట్టడం ద్వారా వాటి ఆరోగ్య ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లో పరిమాణం అధికంగా ఉంటుంది.
సోడియంను తగ్గించడంలో సహాయపడుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో చాలా క్యాల్షియం ఉంటుంది. చలికాలంలో జుట్టు పొడిబారటం వంటి సమస్యలను నిరోధిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఐరన్ అధికంగా ఉన్న నల్ల ఎండు ద్రాక్షలను తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. ద్రాక్షలో ఉండే రెస్పెటల్ వల్ల శరీరంలో బీటాస్ లెవెల్స్ తగ్గించి షుగర్ వ్యాధిగ్రస్తులకు కొంత ఉపసంహాన్ని కలిగిస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రించి డయాబెటి సమస్య నుంచి దూరం చేయటంలో ద్రాక్ష చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా చేయడంలో ఉపయోగపడతాయి. ద్రాక్షలో ఉండే కెటిల్ అనే కాంపౌండ్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. ఆహారం ద్వారా వ్యాప్తి చెందే ఇతర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ద్రాక్షా పళ్ళు తొక్క నుంచి తీసిన ఎక్స్ట్రాస్ట్రిక్ వల్ల బ్లూ వైరస్ ను నాశనం చేయడంలో ఉపయోగపడుతుందని తెలిసింది.
అంతేకాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా ద్రాక్ష పళ్ళు కాపాడుతాయి. అలాగే కూడా క్యాన్సర్ వ్యాధిని కూడా నియంత్రించగలిగినట్లు తెలుస్తుంది. ద్రాక్ష పళ్ళు ఎక్కువగా తినే కొన్ని రకాల జంతుజాతులు జీవించే కాలాన్ని కూడా పెరిగినట్లు తెలుసుకున్నారు. అప్పుడే చెట్టు నుండి కోసిన ద్రాక్ష పండ్లను తినటం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది…