Apple Peels : యాపిల్ తొక్కల్ని తీసి పడేస్తున్నారా… దీని లాభాలు తెలిస్తే ఆ పని చేయరు…?
ప్రధానాంశాలు:
Apple Peels : యాపిల్ తొక్కల్ని తీసి పడేస్తున్నారా... దీని లాభాలు తెలిస్తే ఆ పని చేయరు...?
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు. అయితే, మంది యాపిల్ తినేముందు దానిపై ఉన్న తోలును తీసి పడేస్తూ ఉంటారు. చిన్నపిల్లలయితే ఆపిల్ తినరని,ఆపిల్ పై ఉన్న తొక్కని తొలగించి ఇస్తారు. ఆ తొక్కలని పడేస్తారు. అయితే, వాటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి అంటున్నారు నిపుణులు.ఈ తొక్కలలో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.ఈ తొక్కలని తినకుండా బయటపడేసే వారికి ఇది తప్పక తెలుసుకోవాల్సిన విషయం. తొక్కలతో వేసవిలో అనేక ప్రయోజనాలు ఉంటాయట. ఈ తొక్కలలో విటమిన్ k, E ఉండటమే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి లభించే ప్రయోజనాలు తెలుసుకుందాం..

Apple Peels : యాపిల్ తొక్కల్ని తీసి పడేస్తున్నారా… దీని లాభాలు తెలిస్తే ఆ పని చేయరు…?
తొక్కలలో క్వెర్సెటిన్, కాటేచిన్స్, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కణాలను ఆక్సికరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. తొక్కల లో ఫైబర్,పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కొలెస్ట్రాల స్థాయిలో రక్తపోటు, వాపులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఆపిల్ తొక్కలో ఫైబర్,పాలి ఫైనల్స్ రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఆపిల్ తొక్కలో ఫైబర్ కి మంచి మూలం. ఇది జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన గట్టు బ్యాక్టీరియాలకు మద్దతుని ఇస్తుంది. ఆంటీ ఆక్సిడెంట్లు క్వాలిఫైనాల్స్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని కొన్ని అధ్యయనాలలో సృష్టించారు. అంతేకాదు,దీనిని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు కూడా అవసరం.
చర్మం తేమ తక్కువగా ఉండడం వల్ల పొడిగా ఉంటుంది. చర్మాన్ని పొడి బారకుంట ఉంచేందుకు ఆపిల్ తొక్కలు ఉపయోగపడతాయి. ఈ తొక్కలను టమాటాలతో కలిపి గ్రైండ్ చేసి కాస్త పెరుగు వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్టుకి అప్లై చేసి, ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో ఫేస్ కడగాలి. ఆపిల్ తొక్కలను పౌడర్ లా చేసుకుని, బటర్ కలిపి ఫేస్ కి అప్లై చేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత వెంటనే నీటినితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఎల్లప్పుడూ మీ ముఖం నివారింపుతో విలమిలా మెరుస్తుంది అంటున్నారు నిపుణులు.