Morning : ఉదయాన్నే టిఫిన్ కు బదులు అన్నం తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!
Morning : ఈ రోజుల్లో చాలా మంది ఉదయం పూట టిఫిన్ తింటున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం మన తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలు మాత్రం ఉదయాన్నే అన్నం తినేవారు. అన్నం తిని పనికి వెళ్లేవారు. ఒక రకంగా వాళ్లు మనకంటే చాలా ఆరోగ్యంగా జీవించారు. వారి శరరం మనకంటే ఎంతో ధృడంగా ఉండేది. కానీ ఇప్పటి జనరేషన్ లో మాత్రం చాలా మంది అన్నం తినడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అన్నం తింటే బరువు పెరుగుతామని వారు ఇలా చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఉదయం పూట లేటుగా లేస్తుంటారు. అలాంటి వారు కూడా సమానికి ఉదయం తినరు.
Morning ఉదయం పూట తింటే..
ఒకవేళ ఉదయం 11గంటల లోపు తినే వారు కూడా అన్నం తినడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే రక్తంలో కొవ్వులు పెరిగిపోతాయని వారు భావిస్తున్నారు. అంతే కాకుండా కొందరు షుగర్ పేషెంట్లు కూడా ఇలాంటి విధానాన్ని అవలంబిస్తున్నారు. ఎందుకంటే ఉదయం పూట అన్నం తింటే షుగర్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అలాంటి వారు అందరూ కూడా ఉదయం పూట అన్నం తినకుండా రోటీ లేదంటే ఇతర టిఫిన్లు చేసుకుని తింటున్నారు. కాగా ఇలా ఉదయం పూట అన్నం తింటే నిజంగానే మంచిది కాదా అని అంటే మంచిదే అని చెప్పుకోవాలి.
ఎందుకంటే ఉదయం పూట అన్నం తింటే మన బాడీకి శక్తి లభిస్తుంది. వాస్తవానికి ఉదయం పూట లేచిన తర్వాత మన బాడీని ఉత్సాహపరచాలి. మన బాడీకి శక్తి కూడా కావాలి. అందుకే అన్నం తింటే మంచిదే. కానీ అన్నం మోతాదుకు మించి తినొద్దని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అన్నాన్ని ఉదయం పూట మోతాదుకు మించి తింటే బరువు పెరుగుతారు. అటు షుగర్ పేషెంట్లు కూడా మోతాదుకు మించి తింటే రక్తంలో షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయి. లేనిపోని సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఏ ఆహారాన్ని అయినా సరే మోతాదుకు మించి తింటే కచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు. కాబట్టి ఉదయం పూట అన్నాన్ని మోతాదుకంటే తక్కువ తింటే బాడీకి శక్తితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.