Ajwain Leaves : మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా… అయితే, మీకు ఈ ఆకు బెస్ట్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ajwain Leaves : మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా… అయితే, మీకు ఈ ఆకు బెస్ట్…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Ajwain Leaves : మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా... అయితే, మీకు ఈ ఆకు బెస్ట్...?

Ajwain Leaves : చాలామంది తమ ఇంటి పెరట్లో, కుండీలలో ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క ఎంతో రుచిగా, ఘాటుగా, సువాసనతో కలిగి ఉంటుంది. ఈ మొక్క ప్రకృతి ప్రసాదించిన మొక్కలలో ఇది ఒక ఔషధ మొక్క అని చెప్పవచ్చు.దీనిలో మూలికా గుణం ఉంది. మీ పెరట్లో ఉన్నా కూడా మీరు అంతగా పట్టించుకోరు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టరు. ఆ మొక్క పేరు వామ మొక్క. ఈ మామ మొక్క ఆకు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు అంటున్నారు నిపుణులు. ఈ వామ ఆకులలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వామ ఆకు సీజనల్ గా వచ్చే జలుబు,దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు,మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది అంటున్నారు నిపుణులు. మరి ఈ వామ ఆకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం…

Ajwain Leaves మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా అయితే మీకు ఈ ఆకు బెస్ట్

Ajwain Leaves : మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా… అయితే, మీకు ఈ ఆకు బెస్ట్…?

Ajwain Leaves  వామ్మ ఆకు ప్రయోజనాలు

మామ నాకు బరువు తగ్గడానికి సహకరిస్తుంది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వామ ఆకులను తిన్నట్లయితే, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.వామ ఆకు కీళ్ల నొప్పులు,వాపులను తగ్గించడానికి కూడా దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజు రెండు ఆకులు నమిలితే శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. వామ్మ ఆకులను తరచూ తిన్నట్లయితే, శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు విడుదల చేస్తుంది. అందుకోసం వామ ఆకులని తేనె, వెనిగర్ తో కలిపి తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు, దీంతో కిడ్నీలో ఉన్న రాళ్ల సమస్యలు కూడా తగ్గించే గొప్ప గుణం ఉందంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారికి కూడా ఈ వామ ఆకులు తింటే ఐరన్ ఉత్పత్తి పెరుగుతుంది.తద్వారా,రక్తహీనత సమస్య దూరమవుతుంది. మహిళల్లో ఎదురయ్యే పీరియడ్స్ నొప్పిని తగ్గించగలవు ఈ వామ ఆకులు.వీటిని తింటే పీరియడ్స్ టైం లో వచ్చే నొప్పి తగ్గుతుంది అంటున్నారు.

ఆకులలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వామ ఆకులని నమిలితే నోటిలోని బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.క్యావటిస్, నోటి దుర్వాసన ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు. ఆకులలో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ ఇంకా ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.వామ ఆకు సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. కాబట్టి, ప్రతిరోజు ఈ వామ ఆకులను, రోజుకు రెండు పరిగడుపున తినే అలవాటు చేసుకోండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది