Diabetes : షుగర్ కంట్రోల్ కావాలంటే… వెంటనే ఈ ఆహారాలను తినడం మానేయండి…
Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. టైప్1, టైప్2. టైప్1 డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ ఇన్సూలిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. టైప్2 డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనేది జీర్ణ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడిన హార్మోన్. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఇన్సులిన్ తక్కువ గ్లూకోస్ మొత్తాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మందులు తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండడం, ఆహారాన్ని నియంత్రించడం అవసరం. ఆహారంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు షుగర్ ని నియంత్రించడానికి శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకోవాలి.
ఆహారంలో చక్కెరను పెంచని ఆహారాలను తీసుకోవాలి. షుగర్ ను పెంచే కొన్ని ఆహార పదార్థాలను పక్కన పెట్టాలి. డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవడానికి షుగర్ పేషెంట్లు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. టైప్ 2 డయాబెటిస్ వారు స్వీట్స్, సోడా వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ ఆహారాలు చక్కెరను పెంచడం కాకుండా బరువు పెరగడానికి కూడా కారణం అవుతాయి. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కానీ పండ్లరసం షుగర్ రోగుల కష్టాన్ని మరింత పెంచుతాయి. డయాబెటిస్ ని అదుపులో ఉంచడానికి పండరసాలను తీసుకోకూడదు. అలాగే డ్రై ఫ్రూట్స్ మీ శరీరంలో డిహైడ్రేషన్ పెంచుతాయి. వీటికి బదులుగా మీ ఫుడ్ మెనూలో ద్రాక్ష ఉండి ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తినాలి.
డయాబెటిస్ బాధితులు తెల్లటి పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా తృణధాన్యాలు తినాలి. తెల్ల బియ్యం, తెల్ల రొట్టె ఇవన్నీ పక్కన పెట్టాలి. బియ్యం లో ఉండే కార్బోహైడ్రేట్లు చక్కెరలా పనిచేస్తాయి. ఇవి గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులను నివారించాలి. తక్కువ కొవ్వు పదార్థాలను తినాలి. టైపు 2 డయాబెటిస్ ఉన్న వారు అధిక కొవ్వు మాంసాన్ని తినకూడదు. గొడ్డు మాంసం బోలోగ్నా, హాట్ డాగులు, సాసేజ్, బేకన్ లలో అధిక కొవ్వు ఉంటుంది. వీటిని అస్సలు తినకూడదు. ఆయిల్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. ఆల్కహాల్ అసలు తీసుకోకూడదు. ఈ ఆహారాలను కనుక తీసుకోకుండా ఉంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.