Beauty Tips : ఇలా చేశారంటే 10 నిమిషాల్లో… నల్లటి కాళ్ళు తెల్లగా అవుతాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ఇలా చేశారంటే 10 నిమిషాల్లో… నల్లటి కాళ్ళు తెల్లగా అవుతాయి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :24 October 2022,2:40 pm

Beauty Tips : సన్ టాన్, దుమ్ము ధూళి వలన చాలామందికి కాళ్లు, చేతులు, మెడ వంటి భాగాలలో చర్మం నల్లగా మారిపోతుంది. ఎక్కువగా బయట పనులకు వెళ్లే వారికి ఇలా అవుతుంది. బట్టలు వేసుకున్న భాగంలో తెల్లగా ఉండి మిగతా భాగంలో నల్లగా ఉంటుంది. ఇలా ఉండడం వలన చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే నలుపు పోగొట్టుకోవడానికి కెమికల్స్ ఉండే ఎటువంటి ప్రొడక్ట్స్ లను ఉపయోగించకుండా నేచురల్ గా ఈ చిట్కాతో తెల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బకెట్లో వేడి నీళ్లు తీసుకొని అందులో ఒక నిమ్మ చెక్కరసం వేసుకొని 10 నిమిషాల పాటు కాళ్లు నీటిలో పెట్టి ఉంచాలి. తర్వాత బయటకు తీసి తడి తూడుచుకోవాలి.

తర్వాత బాగా పండిన టమాటా జ్యూస్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. టమాటా జ్యూస్ సన్ టాన్ తొలగించడంలో బాగా పనిచేస్తుంది. చర్మం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోవాలంటే టమాటో జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో అర చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం కూడా సన్ టాన్ రిమూవ్ చేసి చర్మం తెల్లగా కాంతివంతంగా అయ్యేలా చేస్తుంది. తర్వాత దీనిలో ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి స్కిన్ తెల్లగా అవటానికి చాలా బాగా సహాయపడుతుంది. తర్వాత దీనిలో పావు స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా చర్మంపై ఉండే జిడ్డు, మురికిని తొలగించడంలో బాగా సహాయపడుతుంది.

Beauty tips for remove black skin

Beauty tips for remove black skin

వీటన్నింటిని బాగా కలుపుకొని చర్మం నల్లగా ఉండే ప్రదేశాలలో రాసుకోవాలి. కొంచెం మందంగా అప్లై చేసుకుని ఆరిన తర్వాత నిమ్మ చెక్క సహాయంతో ఈ ప్యాక్ అప్లై చేసుకున్న చోట రుద్దుకోవాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన కాళ్లు, చేతులు, మెడ వంటి భాగాల్లో నలుపు మొత్తం పోయి తెల్లగా ఉంటుంది. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించలేదు కాబట్టి ఈ ప్యాక్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కాను అన్ని వయసులవారు ఉపయోగించవచ్చు. ఎన్నో రకాల చిట్కాలను ప్రయత్నించి ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది