Exercise : అమ్మాయిలు జాగ్రత్త… ఫిట్ నెస్ కోసం ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా… ప్రమాదంలో పడ్డట్టే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Exercise : అమ్మాయిలు జాగ్రత్త… ఫిట్ నెస్ కోసం ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా… ప్రమాదంలో పడ్డట్టే…!

Exercise : తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవాలి అన్న మరియు శరీరంలో ఎక్కువ కొవ్వును కలిగించుకోవాలన్నా నిత్యం ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. కాబట్టి. దీనికోసం ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయటం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. ఎక్కువగా వ్యాయామం చేయటం వలన శారీరక హాని కలుగుతుంది. ఈ ప్రమాదం అనేది మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే మహిళలు అధిక వ్యాయామం చేయడం వలన […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Exercise : అమ్మాయిలు జాగ్రత్త... ఫిట్ నెస్ కోసం ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా... ప్రమాదంలో పడ్డట్టే...!

Exercise : తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవాలి అన్న మరియు శరీరంలో ఎక్కువ కొవ్వును కలిగించుకోవాలన్నా నిత్యం ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. కాబట్టి. దీనికోసం ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయటం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. ఎక్కువగా వ్యాయామం చేయటం వలన శారీరక హాని కలుగుతుంది. ఈ ప్రమాదం అనేది మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే మహిళలు అధిక వ్యాయామం చేయడం వలన రుతు చక్రంపై ప్రభావం పడుతుంది. దీంతో సక్రమంగా రుతుక్రమం అనేది రాదు. ఈ వ్యాధి ని అమోనోరియా అని అంటారు. అయితే మన శరీరానికి తగినంత విశ్రాంతి లేక ఆహారం అనేది అందకపోతే ఈ సమస్య వస్తుంది.

అలాగే మన శరీరం పై అధిక ఒత్తిడి అనేది పరితీరును కూడా నియంత్రిస్తుంది. అలాగే ఆహార అనేది లేకపోవడం వలన కూడా ఈ విధమైన ప్రభావం పడుతుంది. ఇది జీర్ణ క్రియను కూడా నెమ్మదిస్తుంది. అయితే ఎక్కువ వ్యాయామం చేయటం వలన అమ్మాయిలల్లో హార్మోన్ల ఉత్పత్తి అనేది తగ్గుతుంది. అప్పుడు ఇది మహిళల రుతుచక్రం పై కూడా ప్రభావం పడుతుంది. దీని ఫలితంగా ప్రతినెల రావలసిన రుతుచక్రం అస్తవ్యస్తంగా మారుతుంది. అంతేకాక ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది అధిక వ్యాయామం మరియు కఠినమైన ఆహారం వలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

ఎన్నో సందర్భాలలో ఎక్కువ శారీరక శ్రమ సాధారణ కంటే చాలా తక్కువ రుతు రక్త స్రావాన్ని కలిగిస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు గనక ఉంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి రేటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్ అనేది రుతు స్రావంతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే హఠాత్తుగా బరువు తగ్గటం వలన కూడా రుతు రక్త స్రావం తగ్గుతుంది. అయితే ఈ పీరియడ్స్ అనేవి నెలనెలా రాకపోతే అస్సలు మంచిది కాదు. అలాగే రుతుక్రమం అనేది సక్రమంగా లేకుంటే శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ల ఉత్పత్తి రేటు అనేది తగ్గుతుంది. ఇది ఎముకలను కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి. అలాగే ఎముకలకు నష్టం కూడా కలుగుతుంది. అందుకే ఈ సమస్యలనేవి వచ్చినప్పుడు ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం…

Exercise అమ్మాయిలు జాగ్రత్త ఫిట్ నెస్ కోసం ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా ప్రమాదంలో పడ్డట్టే

Exercise : అమ్మాయిలు జాగ్రత్త… ఫిట్ నెస్ కోసం ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా… ప్రమాదంలో పడ్డట్టే…!

ఆహారంలో మార్పుల నుండి వ్యాయామ టైం తగ్గించడం వరకు జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం వలన పరిష్కారం దొరుకుతుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, రుతుక్రమ టైమ్ లో వ్యాయామం మరియు యోగ చేయడం వలన పీరియడ్స్ టైం లో తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. అయితే ఈ టైంలో అధిక శారీరక వ్యాయామం చెయ్యకపోవడం చాలా మంచిది. అలాగే వారంలో ఏడు రోజుల పాటు వ్యాయామం చేసిన కనీస ఒక్క రోజైనా విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది