Exercise : వ్యాయామం చేసేవారు ఏ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలంటే…!
ప్రధానాంశాలు:
Exercise : వ్యాయామం చేసేవారు ఏ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలంటే...!
Exercise : ప్రస్తుతం మారినటువంటి జీవనశైలిలో శారీరక శ్రమ అనేది కచ్చితంగా అవసరం. దీంతో యోగ మరియు వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే చాలామంది ఖాళీ కడుపుతోనే వ్యాయామాన్ని చేస్తున్నారు. ఇలా చేయటం ఎంత మాత్రం మంచిది కాదు. అదే టైంలో కడుపు నిండా ఆహారం తిని వ్యాయామం చేయడం కూడా అంత మంచిది కాదు. అయితే వ్యాయామం చేసేటప్పుడు శరీరం నుండి ఎక్కువ చెమట అనేది రిలీజ్ అవుతుంది. దీనివలన శరీరం అనేది బలహీనపడి నీరసంగా ఉంటుంది. అలాగే వ్యాయామం చేసిన వెంటనే అతిగా ఆహారం తీసుకున్న లేక ఎక్కువగా నీరు లాంటి వాటిని తాగిన వాంతులు అనేవి అవుతాయి. కాబట్టి వ్యాయామం చేసే అలవాటు ఉన్నటువంటి వారు ఎప్పుడు ఏ సమయంలో ఏమి తినాలో ఇప్పుడు చూద్దాం…
మీరు వ్యాయామం చేసే టైంలో చెమట పట్టడం వలన శరీరం అనేది ఎంతో బలహీన పడుతుంది. అలాగే ఎక్కువ ఆహారం తీసుకున్న వ్యాయామం చేసిన వాంతులు అనేవి అవుతాయి. కాబట్టి వ్యాయామానికి 30 నుండి 45 నిమిషాల ముందు తినడం మంచిది అని నిపుణులు అంటున్నారు. అయితే వ్యాయామం చేసేందుకు అరగంట ముందు తీనడం మంచిది కదా అని అరగంట ముందు బిర్యానీ, ఫులవ్, మాంసాహారం లాంటివి తీసుకొని వ్యాయామం చేస్తే కష్టమే. అయితే ఏం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే మీరు ఎక్సర్సైజులు చేసేందుకు అరగంట ముందు అరటి పండ్లు తీసుకోవచ్చు. అలాగే అరటి పండ్లలో పొటాషియం, కార్బోహైడ్రేట్లు అనేవి సమృద్ధిగా ఉంటాయి. మీరు వ్యాయామం చేసే ముందు ఈ పండ్లను తీసుకోవడం వలన శక్తి అనేది లభిస్తుంది. అలాగే వ్యాయామం చేసే ముందు కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ ను కూడా తీసుకోవచ్చు. అంతేకాక ఇతర రకాల గింజలు, డ్రై ఫ్రూట్స్ లేక ఎండిన పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో సహా ఇతర విటమిన్లు మరియు ఖరిజాలనేవి ఉంటాయి కాబట్టి. వీటిని తీసుకుంటే మంచిది.
వ్యాయామానికి ముందు ఇతర విటమిన్లు మరియు ఈజీగా జీర్ణం అయ్యే ఫైబర్ మరియు లాక్టిక్ యాసిడ్ తో కూడినటువంటి పెరుగును కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ ఆహారం అపానావాయువు మరియు గ్యాస్ లేక వీకారం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక వ్యాయామానికి అరగంట ముందు బ్రెడ్ లేక వేరుశనగ వెన్న మంచి ఆహారం. అలాగే గుడ్డు అలవాటు ఉన్నటువంటి వారు వ్యాయామానికి ముందు ఉడికించినటువంటి గుడ్డును కూడా తీసుకోవచ్చు. అలాగే వ్యాయామం చేసే ముందు ప్రోటీన్లు తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. అయితే చేపలు, మాంసం లాంటి ఆహారం తినడం మంచిది కాదు. దీనికి బదులుగా వోట్మిల్ ను తీసుకోవచ్చు…