Jaggery : బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jaggery : బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా…!!

Jaggery :  బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా. అవును ఇది నిజం. చర్మ సమస్యలను దూరం చేసేందుకు బెల్లాన్ని కూడా వాడవచ్చు. అయితే ఈ బెల్లం లో ఉన్నటువంటి గ్లైకాలిక్ యాసిడ్ అనేది మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. అలాగే ఇది చర్మాన్ని హైడ్రేడ్ గా కూడా ఉంచుతుంది. అంతేకాక గ్రాన్యుయల్స్ చర్మం మీద ఉన్నటువంటి డెడ్ సెల్స్ ను కూడా తొలగిస్తుంది. అలాగే […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Jaggery : బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా...!!

Jaggery :  బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా. అవును ఇది నిజం. చర్మ సమస్యలను దూరం చేసేందుకు బెల్లాన్ని కూడా వాడవచ్చు. అయితే ఈ బెల్లం లో ఉన్నటువంటి గ్లైకాలిక్ యాసిడ్ అనేది మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. అలాగే ఇది చర్మాన్ని హైడ్రేడ్ గా కూడా ఉంచుతుంది. అంతేకాక గ్రాన్యుయల్స్ చర్మం మీద ఉన్నటువంటి డెడ్ సెల్స్ ను కూడా తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని కూడా ఎంతో మృదువుగా మారుస్తుంది. అయితే ఇది ముఖం పై నల్ల మచ్చలు మరియు మొటిమలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ బెల్లం అనేది ముఖంపై ముడతలు మరియు గీతలు దురద లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది…

ఒక స్పూన్ బెల్లాన్ని తీసుకొని దానిలో ఒక స్పూన్ తేనె మరియు నిమ్మ రసం ను కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని మర్ధన చేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత కడిగేస్తే మీ ముఖం ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది. అలాగే చర్మాన్ని కూడా ఎంతో మృదువుగా మారుస్తుంది. అలాగే ఈ బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు మినరల్స్, జింక్, సెలీనియం ముఖంపై ముడతలను రానియకుండా చూస్తుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మొటిమలు రాకుండా కూడా చూస్తుంది. అలాగే చర్మం పై ఉన్న బ్యాక్టీరియాని కూడా తొలగిస్తుంది…

Jaggery బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా

Jaggery : బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా…!!

ప్రతిరోజు బెల్లాన్ని తింటే బ్లడ్ సెర్కులేషన్ అనేది బాగా పెరుగుతుంది. దీనివలన సెల్ టర్నోవర్ ఎక్కువ అవుతుంది. అలాగే స్కిన్ కూడా ఎంతో బ్రైట్ గా అవుతుంది. అయితే ఈ బెల్లం లో ఉండే పోషకాలు వలన మన ఎండ లోకి వెళ్లినా కూడా స్కిన్ పాడవకుండా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి మినరల్స్ మరియు విటమిన్స్ వలన గాయం తగిలినప్పుడు ఆ గాయన్ని తొందరగా మానేలా చూస్తుంది. అలాగే ఈ బెల్లం తో ఫేస్ ప్యాక్ చేసుకోవడం కూడా ఈజీయే. ముందుగా ఒక చెంచా బెల్లాన్ని తీసుకోవాలి. తర్వాత దానిలో ఒక చెంచా శనగపిండి మరియు ఒక చెంచా పాలు పోసుకొని కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని ఫేస్ కి అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. దాని తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని వాస్ చేసుకోవాలి. మీరు గనక నిత్యం కచ్చితంగా ఇలా చేస్తూ ఉంటే మీ ముఖంలో కొత్త మెరుపు కనిపిస్తుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది