Tomato Juice : ఈ రసాన్ని ఒక గ్లాస్ తీసుకుంటే చాలు… కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tomato Juice : ఈ రసాన్ని ఒక గ్లాస్ తీసుకుంటే చాలు… కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టినట్లే…!

Tomato Juice : ప్రస్తుత కాలంలో మన జీవనశైలి,ఆహార అలవాట్ల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం.ఈ సమస్యలలో ఒకటి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగటం వలన గుండె సమస్యలు, గుండెపోటు లేక రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో శరీరంలోని రక్త ప్రసరణ అనేది ఎంతో మందగిస్తుంది. దీనితో పాటుగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వలన కళ్ళు,చర్మం ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 June 2024,9:00 am

Tomato Juice : ప్రస్తుత కాలంలో మన జీవనశైలి,ఆహార అలవాట్ల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం.ఈ సమస్యలలో ఒకటి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగటం వలన గుండె సమస్యలు, గుండెపోటు లేక రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో శరీరంలోని రక్త ప్రసరణ అనేది ఎంతో మందగిస్తుంది. దీనితో పాటుగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వలన కళ్ళు,చర్మం ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అందువలన కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామంతో పాటుగా మంచి ఆహారం కూడా తీసుకోవాలి…

Tomato Juice కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ప్రమాదం

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల గుండె ఆరోగ్యం అనేది ఎంతో నశిస్తుంది. ప్రస్తుతం 30 సంవత్సరాల లోపు వారిలో గుండెపోటు సమస్యలు పెరుగుతున్నాయి. అయితే కొలెస్ట్రాల్ పెరిగితే ముందు చాతిలో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాక ఇది ఊబకాయం, గుండెపోటు ప్రమాదాలను కూడా పెంచుతుంది…

ఈ వెజిటేబుల్ జ్యూస్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది : శరీరంలో పేర్కొన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో టమాటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అందువల్ల నీరు, ఖనిజ పోషకాలు ఉన్నటువంటి టమాటా రసాన్ని తీసుకోవటం వలన కొలస్ట్రాల్ ను నియంత్రించవచ్చు…

పరిశోధన ఏమి చెబుతుంది : కొన్ని అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే, రెగ్యులర్ గా ఒక కప్పు టమాటా రసం తీసుకోవటం వలన శరీరంలో కొలెస్ట్రా ల్ స్థాయిలను 10 శాతం వరకు నియంత్రించవచ్చు. ఈ టమాటా లో ఉండే ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపిన్ కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం చూసినట్లయితే, ఒక్క రోజులో 25 mg కంటే అధిక లైకోపిన్ తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది అని అధ్యయనంలో తేలింది. అంతే కాక మంచి కొలెస్ట్రాల్ పరిమాణం కూడా పెరుగుతుంది అని అధ్యయనంలో తేలింది. అయితే ఈ టమాటా రసాన్ని ఎక్కువ గా తీసుకోకూడదు.

Tomato Juice ఈ రసాన్ని ఒక గ్లాస్ తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టినట్లే

Tomato Juice : ఈ రసాన్ని ఒక గ్లాస్ తీసుకుంటే చాలు… కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టినట్లే…!

టమాటా రసం ఎలా తాగాలి : నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి తాజాగా ఉన్న కొన్ని టమాటాలను తీసుకొని కొద్దిగా నీటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా రసాన్ని తీసుకునేటప్పుడు దానిలో ఉప్పు, పంచదార లాంటివి ఏమీ కూడా కలపకూడదు అని గుర్తుంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే. టమాట సూప్ లాంటివి కూడా చేసుకొని తీసుకుంటే చాలా మంచిది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది