Tomato | టమాటా థెరపీతో బొడ్డు కొవ్వుకు చెక్.. ఆయుర్వేదం చెబుతున్న అద్భుత చిట్కా
Tomato | నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. తినే అలవాట్లు, నిద్ర పద్ధతులు, శారీరక శ్రమ అన్ని కలిపి అసమతుల్యంగా మారడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో ప్రధానంగా వేధించే సమస్య బొడ్డు కొవ్వు (Belly Fat). ఇది కేవలం రూపానికే కాకుండా ఆరోగ్యానికీ పెద్ద ముప్పు. దీని వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అయితే, ఖరీదైన జిమ్ మెంబర్షిప్స్ లేదా రసాయనాలతో నిండిన ఉత్పత్తులు కాకుండా, ప్రకృతి ఇచ్చిన సులభమైన పరిష్కారం టమాటా (Tomato) అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
#image_title
టమాటా ఎందుకు ప్రత్యేకం?
టమాటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో విషపదార్థాలను బయటకు పంపి, కణాలను రక్షిస్తుంది. అలాగే ఇది జీవక్రియ (Metabolism) ను వేగవంతం చేస్తుంది. జీవక్రియ మెరుగుపడితే కొవ్వు దహనం కూడా వేగంగా జరుగుతుంది.
ఇలా తీసుకుంటే ఫలితం చక్కగా!
రోజుకు భోజనానికి ముందు రెండు సార్లు 3–4 పండిన టమాటాలు తినడం వల్ల బొడ్డు కొవ్వు క్రమంగా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కొద్దిగా రాతి ఉప్పు, నల్ల మిరియాల పొడి కలిపి తింటే రుచి కూడా బాగుంటుంది, జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.
టమాటా యొక్క ఇతర లాభాలు
విటమిన్ A, C, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి
ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు
అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి
చర్మం, రక్త ప్రసరణ మెరుగవుతుంది