
Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్...!
Mustard Oil : వంటల్లోనే కాదు చర్మ సంరక్షణలో కూడా ఆవనూనె ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అయితే చలికాలంలో ఆవనూనెతో చర్మాని సంరక్షించుకోవచ్చు. చలికాలంలో పొడి వాతావరణం కారణంగా చాలామంది చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మం డల్ అవుతుంది. కాబట్టి చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం. అది ఎలా అంటే చర్మ సంరక్షణకు ఆవనూనెని ఉపయోగించవచ్చు. ఆవనూనె చర్మానికి ఎంతో పోషణని ఇస్తుంది. అంతేకాదు కొందరు ఆవనూనెతో స్నానం కూడా చేస్తారు. ఇక ఆవనూనెలో కొవ్వు ఆమ్లాలు పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ నూనె ఉపయోగించడం వల్ల చర్మం తేమగా మృదువుగా మారుస్తుంది. ముఖ్యంగా చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
పొడి చర్మం వలన సోరియాసిస్ ఎగ్జిమా ప్రమాదాలను పెంచుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆవ నూనెను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఆవనూనెలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు కొన్ని చుక్కల నూనెతో మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ మెరుగు పడటంతో పాటు చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఆవ నూనెను ముఖం పైనే కాకుండా శరీరంలోని మిగిలిన భాగాలపై కూడా మసాజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది.
Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్…!
నిర్జలీకరణ కారణంగా చర్మం త్వరగా వృద్ధాప్యం చెందుతుంది. కాబట్టి చర్మ తేమను కాపాడుకోవడం చాలా అవసరం. ముడతలు ఫైన్ లైన్లను తొలగించడంలో మస్టర్డ్ ఆయిల్ వేగంగా పనిచేస్తుంది. అయితే ఈ ఆయిల్ లో కాటన్ గుడ్డను ముంచి దానిని ముఖం పైన అప్లై చేయాలి. ఇక మస్టర్డ్ ఆయిల్ చర్మాన్నే కాకుండా జుట్టును కూడా సంరక్షిస్తుంది. అంతేకాదు ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మస్టర్డ్ ఆయిల్ జుట్టు చిట్లిపోవడం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు ఆవాల నూనెతో తలకు మసాజ్ చేయడం వలన వెంట్రుకల కుదుళ్లను బలపరుస్తుంది. అలాగే జుట్టు సహజ మెరుగును ఇది కాపాడుతుంది
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.