Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్…!

Mustard Oil : వంటల్లోనే కాదు చర్మ సంరక్షణలో కూడా ఆవనూనె ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అయితే చలికాలంలో ఆవనూనెతో చర్మాని సంరక్షించుకోవచ్చు. చలికాలంలో పొడి వాతావరణం కారణంగా చాలామంది చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మం డల్ అవుతుంది. కాబట్టి చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం. అది ఎలా అంటే చర్మ సంరక్షణకు ఆవనూనెని ఉపయోగించవచ్చు. ఆవనూనె చర్మానికి ఎంతో పోషణని ఇస్తుంది. అంతేకాదు కొందరు ఆవనూనెతో స్నానం కూడా చేస్తారు. ఇక ఆవనూనెలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 November 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్...!

Mustard Oil : వంటల్లోనే కాదు చర్మ సంరక్షణలో కూడా ఆవనూనె ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అయితే చలికాలంలో ఆవనూనెతో చర్మాని సంరక్షించుకోవచ్చు. చలికాలంలో పొడి వాతావరణం కారణంగా చాలామంది చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మం డల్ అవుతుంది. కాబట్టి చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం. అది ఎలా అంటే చర్మ సంరక్షణకు ఆవనూనెని ఉపయోగించవచ్చు. ఆవనూనె చర్మానికి ఎంతో పోషణని ఇస్తుంది. అంతేకాదు కొందరు ఆవనూనెతో స్నానం కూడా చేస్తారు. ఇక ఆవనూనెలో కొవ్వు ఆమ్లాలు పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ నూనె ఉపయోగించడం వల్ల చర్మం తేమగా మృదువుగా మారుస్తుంది. ముఖ్యంగా చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

పొడి చర్మం వలన సోరియాసిస్ ఎగ్జిమా ప్రమాదాలను పెంచుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆవ నూనెను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఆవనూనెలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు కొన్ని చుక్కల నూనెతో మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ మెరుగు పడటంతో పాటు చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఆవ నూనెను ముఖం పైనే కాకుండా శరీరంలోని మిగిలిన భాగాలపై కూడా మసాజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది.

Mustard Oil చలికాలంలో ఆవనూనెతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్

Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్…!

నిర్జలీకరణ కారణంగా చర్మం త్వరగా వృద్ధాప్యం చెందుతుంది. కాబట్టి చర్మ తేమను కాపాడుకోవడం చాలా అవసరం. ముడతలు ఫైన్ లైన్లను తొలగించడంలో మస్టర్డ్ ఆయిల్ వేగంగా పనిచేస్తుంది. అయితే ఈ ఆయిల్ లో కాటన్ గుడ్డను ముంచి దానిని ముఖం పైన అప్లై చేయాలి. ఇక మస్టర్డ్ ఆయిల్ చర్మాన్నే కాకుండా జుట్టును కూడా సంరక్షిస్తుంది. అంతేకాదు ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మస్టర్డ్ ఆయిల్ జుట్టు చిట్లిపోవడం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు ఆవాల నూనెతో తలకు మసాజ్ చేయడం వలన వెంట్రుకల కుదుళ్లను బలపరుస్తుంది. అలాగే జుట్టు సహజ మెరుగును ఇది కాపాడుతుంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది