Best Remide For Infection : ఈ ఒక్క ఆకుతో ప్రమాదకరమైన వైరస్ లతో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం మటాష్… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Best Remide For Infection : ఈ ఒక్క ఆకుతో ప్రమాదకరమైన వైరస్ లతో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం మటాష్…

Best Remide For Infection : శీతాకాలం వచ్చిందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు జలుబు, దగ్గు, జ్వరాలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఆస్పత్రి నిండా వైరల్ ఫీవర్ తో చాలా మంది అడ్మిట్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం.. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే.. సీజన్ మారినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సోకడం ద్వారా మన ప్రతిరోజు బయటికి వెళ్తూ ఉంటాం కదా.. అలా ఒకరి నుంచి […]

 Authored By jyothi | The Telugu News | Updated on :29 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Best Remide For Infection : ఈ ఒక్క ఆకుతో ప్రమాదకరమైన వైరస్ లతో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం మటాష్...

Best Remide For Infection : శీతాకాలం వచ్చిందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు జలుబు, దగ్గు, జ్వరాలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఆస్పత్రి నిండా వైరల్ ఫీవర్ తో చాలా మంది అడ్మిట్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం.. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే.. సీజన్ మారినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సోకడం ద్వారా మన ప్రతిరోజు బయటికి వెళ్తూ ఉంటాం కదా.. అలా ఒకరి నుంచి ఇంకొకరికి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ సోకడం వల్ల వైరల్ ఫీవర్ కి మన గురవుతూ ఉంటాం. అయితే దగ్గు, జలుబు, జ్వరం అనేది ఈ సీజన్లో బాగా ఎక్కువ వస్తాయి. కాబట్టి వీటిని మనం ఎటువంటి మందులు వాడకుండా చక్కగా ఒక డ్రింక్ తయారు చేసుకొని తాగితే వ్యాధి నిరోధక శక్తి చక్కగా మాత్రమే కాకుండా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కి మనం గురవకుండా ఉండే అద్భుతమైన సూపర్ డ్రింక్ ఈనాటి మనం తయారు చేసుకోబోతున్నాం..

ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలు మాత్రమే కాకుండా టోటల్ బాడీని అంటే మన శరీరంలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు కూడా ఉండకుండా శరీరం మొత్తం క్లీన్ గా ఉండడానికి అరుగుదల శక్తి బావుండడానికి ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ సూపర్ టీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ఈ టీ ఎలా తయారు చేసుకోవాలి? వాటికి ఏమేం కావాలి. ఈ టీ వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలు పూర్తిగా చూద్దాం.. ముఖ్యంగా బాడీలో ఇమ్యూనిటీ బాగా తగ్గినప్పుడు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎటాక్ అవుతాయి. శీతాకాలంలో అయితే దగ్గు జలుబు వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. అందుకని మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇటువంటి సమస్యలన్నింటికీ కూడా చెక్ పెట్టొచ్చు. ఈ టీ చాలా టేస్టీగా ఉంటుంది.. మరి వీటి ఎలా తయారు చేసుకోవాలో వాటికేమే కావాలో చూసేద్దాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒకటిన్నర గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ వేసుకోండి. అందులో ఒక ఇంచ్ అల్లం కచ్చాపచ్చాగా దంచుకుని ఈ వాటర్ లో వేయండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకోబోయే రెండవ బిర్యానీ ఆకు దీనిని ముఖాలుగా కట్ చేసుకుని దాంట్లో వేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక ఐదు లేదా ఆరు మిరియాలు, రెండు యాలుకలు, నాలుగు లవంగాలు తీసుకోండి. వీటిని క కచ్చాపచ్చాగా దంచి ఈ నీటిలో వేయాలి..

ఇప్పుడు మనం తీసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్ రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్ యాడ్ చేయండి.తర్వాత దాల్చిన చెక్క ముక్క, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే నాలుగు ఆకులు తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. మనం ఇందులో వేసిన ఇంగ్రిడియంట్స్ లో విటమిన్ సి, మెగ్నీషియం పోషకాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల మీరు ఒక నిరోధక శక్తి పెరుగుతుంది. చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ తొందరగా తగ్గిపోతాయి.. అలాగే రోగ నిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి కూడా ఈ టీ లో పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నవారు అంటే డిప్రెషన్ కానీ టెన్షన్ లో ఉన్నవారు ఈ టీ తాగితే మంచి ఉపసమనం కలుగుతుంది. ఇప్పుడు ఈ డ్రింక్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాసులోకి వడకట్టుకోండి. మీరు ఎప్పుడు ఏ డ్రింక్ తయారు చేసుకున్నా గోరువెచ్చగానే తాగాలి. చల్లగా అసలు తీసుకోవద్దు.. అయితే మీరు దీన్ని తయారు చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ ని మూడు భాగాలుగా చేసుకుని ఉదయం ఒక కప్పు మధ్యాహ్నం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తీసుకుంటే సీతానక్కాలా శీతాకాలంలో వచ్చే వైరస్ ల నుండి బయటపడవచ్చు.. శీతాకాలంలో డైలీ రెండుసార్లు ఈ టీ ని తాగినట్లయితే ఎన్నో రోగాలకు చెక్ పెట్టవచ్చు..

jyothi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక