
Betel Leaf : ఈ సమ్మర్ లో ఈ ఆకు రోజుకు ఒకటి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? తెలిస్తే వెంటనే తినడం మొదలుపెడతారు..!
Betel Leaf : హిందూ సాంప్రదాయంలో తమలపాకు కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.. తమలపాకుని శుభసూచికగా చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా సంబంధించి శుభకార్యాలకు సంబంధించి ఈ తమలపాకుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన వారికి తాంబూలం ఇవ్వడానికి కూడా ఈ తమలపాకుని వినియోగిస్తూ ఉంటారు. అయితే శుభకార్యాలకి వినియోగించడమే కాదు.. దీంతో ఆరోగ్యానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.. చాతిలో కఫం, ఊపిరితిత్తుల సమస్యలు ఆస్తమా బాధితులకు తమలపాకు గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనికోసం తమలపాకపై కొద్దిగా ఆవాల నూనె రాసి వేడి చేసి చాతి పై పెడితే మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కొన్ని ఆకులను నీటిలో మరిగించవచ్చు.. రెండు కప్పుల నీటిలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి నీరుని సగానికి వచ్చే వరకు మరిగించాలి.
తర్వాత ఈ ద్రవాన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే చాతిలో కఫం, ఊపిరితిత్తుల సమస్యల నుంచి బయటపడవచ్చు.. అలాగే శ్వాస సమస్యలు ఉన్నవారు తమలపాకుతో పాటు లవంగాలను నీటిలో వేసి మరిగించి తీసుకోవచ్చు.. దీనివలన చాలావరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.. అలాగే గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి కూడా తమలపాకు ఎంతగానో సాయపడుతుంది. తమలపాకు నీటిని తాగడం వలన గుండె జబ్బులు మీ దరి చేరవు.. తమలపాకులు క్యాన్సర్ కణాల పెరుగుదలను కంట్రోల్ చేస్తాయి.. అలాగే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ లాంటివి తీసుకోవడం వలన కడుపులో కలిగే ఇబ్బందిని తమలపాకు తగ్గిస్తుంది. తమలపాకు నమలడం వలన అజీర్ణం, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. అలాగే తమలపాకుని సాధారణంగా మౌత్ ఫ్రెషర్ గా వినియోగిస్తారు. తమలపాకు నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. దీనిలోని ఆంటీ మైక్రోబియన్ లక్షణాలు మీ నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.
Betel Leaf : ఈ సమ్మర్ లో ఈ ఆకు రోజుకు ఒకటి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? తెలిస్తే వెంటనే తినడం మొదలుపెడతారు..!
భోజనం చేసిన తర్వాత తామలపాకల తినడం వలన మీ జీర్ణ క్రియతో పాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీనిలోనే ఉండే విటమిన్ లో పోషకాలు ప్రేగులను శుభ్రం చేస్తాయి. పాన్ ఆకులను నమిలితే మీ నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే దంతాలలో క్యావి టీస్ దంతక్షయాన్ని అరికట్టి నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.. తమలపాకులు నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ తమలపాకులు పేస్ట్ ని గాయాలపై అప్లై చేస్తే వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. తమలపాకుల రసం తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చర్మ సంబంధించిన సమస్యలు ఉన్నవారికి తమలపాకులు అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తాయి. ఎందుకంటే దీన్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా రోజుకొక తమలపాకులు తినండి.. లేదా తమలపాకుల నీటిని తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.