Billa Ganneru Plant : రోజు మూడు ఆకులు… డయాబెటిస్ ఫ‌స‌క్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Billa Ganneru Plant : రోజు మూడు ఆకులు… డయాబెటిస్ ఫ‌స‌క్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 June 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Billa Ganneru Plant : రోజు మూడు ఆకులు... డయాబెటిస్ ఫ‌స‌క్‌..!

Billa Ganneru Plant : ప్రస్తుతం మన జీవన విధానంలో ఎన్నో రకాల మార్పులను చూస్తూ ఉన్నాం. చెడు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. నేటి కాలంలో ఫుడ్ ఆర్డర్లు పెట్టి ఎక్కువగా తినే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో వండుకొని తినేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ఈ నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వలన టైం టు టైం నిద్ర అనేది కూడా లేదు. అంతేకాక పని ఒత్తిడి కూడా బాగా ఉంటుంది. ఇక వ్యక్తిగత సమస్యలు కూడా. ఇక ఇతర జన్యు సమస్యల వలన కూడా షుగర్ కేసులు అనేవి ఎంతో విపరీతంగా పెరుగుతున్నాయి. మన దేశం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సవాల్ లో ఒకటి డయాబెటిస్. మన భారత్ లో 20-70 ఏళ్ల వయసు గల జనాభాలో 8.7% మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే దానిని కంట్రోల్ లో ఉంచుకోవడం తప్పితే పూర్తిగా దానిని నివారించలేము. ప్రతిరోజు కూడా టాబ్లెట్లు వాడటం, స్వీట్స్ పక్కన పెట్టడం, సరైన వ్యాయామం,మంచి ఆహారం తీసుకోవడం లాంటి వాటితో డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచొచ్చు అని డాక్టర్లు తెలిపారు. మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు డయాబెటిస్ ను తగ్గించడానికి ఎంతో సహాయం చేస్తాయి అని ఆయుర్వేద ఆరోగ్యం నిపుణులు తెలిపారు. దానిలో ముఖ్యమైనది బిళ్ళ గన్నేరు మొక్క…

రక్తంలోని చక్కెరను నియంత్రించటానికి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచేందుకు బిళ్ల గన్నేరు మొక్క ఎంతో ఉపయోగపడుతుంది అని అంటున్నారు నిపుణులు. NCBI లో ప్రచురించిన నివేదిక ప్రకారం చూస్తే, బిళ్ళ గన్నేరు ఆకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించే కెపాసిటీ కలిగి ఉన్నది. ఇతర దేశాలలోఈ బిళ్ల గన్నేరు ఆకుల రసం టీ ను షుగర్ కు ఔషధంలా వాడతారు అని తెలిపారు. దీంట్లో హైపో గ్లైసోమిక్ యాక్టివిటీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది అని పరిశోధకులు తెలిపారు. రక్తంలో చక్కెరపై బిళ్ల గన్నేరు ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకునేందుకు పరిశోధకులు తమ నివేదికలో డయాబెటిస్ ఉన్న కుందేలపై పరిశోధనలు చేశారు. ఈ కుందేలకు బిళ్ల గన్నేరు ఆకుల రసాన్ని ఇచ్చారు.

Billa Ganneru Plant రోజు మూడు ఆకులు డయాబెటిస్ ఫ‌స‌క్‌

Billa Ganneru Plant : రోజు మూడు ఆకులు… డయాబెటిస్ ఫ‌స‌క్‌..!

ఈ తరుణంలో వాటి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది 16 నుండి 31.9% వరకు తగ్గినట్టుగా కనుక్కున్నారు. బిళ్ల గన్నేరులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు అనేవి అధికంగా ఉన్నాయి. కావున ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది అని నిపుణులు తమ అధ్యయనం లో కనుక్కున్నారు. ఈ బిళ్ల గన్నేరు ఆకులను ఆల్కలాయిడ్స్, టానిన్లు అధికంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడంతో పాటుగా ఎన్నో సమస్యలకు దూరంగా ఉంచుతుంది. ఈ బిళ్ల గన్నేరు ఆకులను ఎండబెట్టుకొని అవి ఎండిన తరువాత వాటిని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని మీరు ప్రతిరోజు ఒక గ్లాసు పండ్ల రసంలో ఒక టీ స్పూన్ కలుపుకొని తాగాలి. లేక ప్రతి నిత్యం మూడు బిళ్ల గన్నేరు ఆకులను నెమలి కూడా తీసుకోవచ్చు. అయితే ఈ బిళ్ల గన్నేరు పువ్వులను వాటర్ లో వేసి కొద్దిసేపు మరిగించాలి. మరిగించిన ఈ వాటర్ ను వడకట్టుకొని ఉదయం లేవగానే ఒక గ్లాసు ఖాళీ కడుపుతో కూడా తీసుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది