Bitter Gourd Juice : బ్లడ్ షుగర్ తో బాధపడే వారికి… ఈ జ్యూస్ దివ్య ఔషధం…!
ప్రధానాంశాలు:
Bitter Gourd Juice : బ్లడ్ షుగర్ తో బాధపడే వారికి... ఈ జ్యూస్ దివ్య ఔషధం...!
Bitter Gourd Juice : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మధుమేహా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి ఎంతో వేగంగా పెరుగుతాయి. దీని వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చి పడతాయి. అయితే డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కాకరకాయ జ్యూస్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీరికి ఇది ఒక వరం లాగా పని చేస్తుంది అని అంటున్నారు. అయితే ఈ కాకరకాయ జ్యూస్ ని తీసుకోవడం వలన మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఎంతో బాగా మెరుగుపడుతుంది అని అంటున్నారు. ఈ జ్యూస్ అనేది జీవక్రియను కూడా ఎంతగానే పెంచుతుంది. దీనిలో ఉన్న గ్లూకోజ్ శోషణను నియంత్రించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అందుకే ఈ కాకరకాయ జ్యూస్ ను నిత్యం తీసుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది…
ఈ కాకరకాయ జ్యూస్ అనేది ఎంతో చేదుగా ఉంటుంది. కానీ ఇది మాత్రం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఈ కాకరకాయ అనేది మన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ కాకరకాయలో పాలీపెఫ్టేడ్ -పి లేక పి- ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇది షుగర్ పేషెంట్లకు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ కాకరకాయలో విటమిన్ సి బీటా కెరోటిన్ వివిధ పాలిఫెనాల్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలా సార్లు ఆక్సీకరణ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం కూడా ఉన్నది. అలాగే ఆక్సికరణ ఒత్తిడి అనేది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది…
ఇది శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడం వలన కాకరకాయ జ్యూస్ డయాబెటిస్ రోగులలో నెఫ్రొపతి, న్యూరోపతి,రేటినో పతి లాంటి సమస్యలను తగ్గించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ కాకరకాయ జ్యూస్ అనేది బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఈ కాకరకాయ జ్యూస్ లో కెలరీలు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు. అలాగే డయాబెటిస్ పేషెంట్లు బరువు పెరగకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది…