Monsoon : వానాకాలంలో ఆకుకూరలను తినొచ్చా… తింటే ఏమవుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monsoon : వానాకాలంలో ఆకుకూరలను తినొచ్చా… తింటే ఏమవుతుంది…!

 Authored By ramu | The Telugu News | Updated on :28 August 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Monsoon : వానాకాలంలో ఆకుకూరలను తినొచ్చా... తింటే ఏమవుతుంది...!

Monsoon : ఆకు కూరలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు మరియు శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి. అందుకే కచ్చితంగా మనం తీసుకునే ఆహారంలో ఆకు కూరలు కచ్చితంగా ఉండాలి అని నిపుణులు అంటూ ఉంటారు. అయితే ఆకు కూరల ను వర్షాకాలంలో తీసుకోకూడదు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ సీజన్ లో ఆకు కూరలు తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఇంతకీ వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకోవడం వలన ఏం జరుగుతుంది. నిజంగానే ఏమైనా నష్టాలు ఉన్నాయా. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

వానాకాలంలో ఆకు కూరలు తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న దాంట్లో పూర్తిగా నిజం లేకపోయినప్పటికీ కొంత వరకు మాత్రం నిజం ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా వానాకాలంలో ఆకు కూరలు బురదగా ఉంటాయి. అలాగే ఈ వానాకాలంలో గాల్లో తేమ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వైరస్ మరియు బ్యాక్టీరియా అనేది ఈ ఆకులపై పేర్కొని పోతాయి. కావున వర్షాకాలంలో బ్యాక్టీరియా అనేది తమ సంతాన ఉత్పత్తిని పెంచుకునే ప్రదేశంగా ఆకుకూర లను ఎక్కువగా ఎంచుకుంటాయి. కావున ఆకు కూరలు ఎంతో శుభ్రం చేసుకుని తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు నిపుణులు. అలాగే ఆకుకూరల వలన డైరెక్ట్ గా ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. కానీ వాటిపై పేరుకుపోయే వైరస్ మరియు బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన డయేరియా మరియు కడుపునొప్పి తో పాటు ఇతర పేగు కు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు…

Monsoon వానాకాలంలో ఆకుకూరలను తినొచ్చా తింటే ఏమవుతుంది

Monsoon : వానాకాలంలో ఆకుకూరలను తినొచ్చా… తింటే ఏమవుతుంది…!

అలాగని ఈ ఆకు కూరలను పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. వీటిని బాగా శుభ్రం చేసుకుని తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటున్నారు. అయితే ఈ ఆకుకూరలు తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. దీనికోసం ముందుగా ఆకుకూరలు అన్నింటిని కూడా వేరు చేసుకోవాలి. ఆ తర్వాత ఆకులను పొడి క్లాత్ పై వేసి బాగా ఆరబెట్టుకోవాలి. దీంతో దానిలో ఉన్న తేమ అనేది పూర్తిగా పోతుంది. ఆ తర్వాత ఆకుకూరలను వండే ముందు ఉప్పు వేసి నీటిలో కొంతసేపు కొడకబెడితే చాలా మంచిది. ఇలా చేసినట్లయితే వానాకాలంలో ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది