Cashews : ప్రతిరోజు జీడిపప్పు తీసుకుంటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా… ఈ ముఖ్య విషయాలు మీకోసమే…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cashews : ప్రతిరోజు జీడిపప్పు తీసుకుంటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా… ఈ ముఖ్య విషయాలు మీకోసమే…??

 Authored By ramu | The Telugu News | Updated on :26 November 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Cashews : ప్రతిరోజు జీడిపప్పు తీసుకుంటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా... ఈ ముఖ్య విషయాలు మీకోసమే...??

Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు అని చెప్పొచ్చు. వీటిలో మెగ్నీషియం మరియు పొటాషియం, కాపర్, జింక్, మాంగనీస్, ఐరన్, సెలీనియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే జీడిపప్పును తింటే బరువు పెరుగుతారు అని చాలామంది భావిస్తారు. దీని కారణంతో జీడిపప్పును చాలామంది తినరు. దీనిలో నిజం ఎంత ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Cashews ప్రతిరోజు జీడిపప్పు తీసుకుంటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా ఈ ముఖ్య విషయాలు మీకోసమే

Cashews : ప్రతిరోజు జీడిపప్పు తీసుకుంటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా… ఈ ముఖ్య విషయాలు మీకోసమే…??

ఈ జీడిపప్పులో ప్రోటీన్ మరియు మినరల్స్, ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివలన గుండె ఆరోగ్యం మరియు జీర్ణక్రియ అనేది ఎంతో మెరుగుపడుతుంది. అయితే జీడిపప్పును తీసుకోవటం వలన బరువు పెరుగుతారు అనే ఆలోచన తప్పు అని అంటున్నారు నిపుణులు. ఈ జీడిపప్పును సరైన మోతాదులో తీసుకుంటే బరువు అస్సలు పెరగరు. ఈ జీడిపప్పు అనేది బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ జీడిపప్పును ఎక్కువగా తీసుకుంటే మాత్రం బరువు పెరగటం ఖాయం.

ఈ జీడిపప్పులో విటమిన్లు మరియు మెగ్నీషియం లాంటి ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి శరీరానికి కూడా ఎంతో శక్తిని ఇస్తాయి. ఇవి గ్లూకోజ్ మెటపాలిజంలో కూడా మేలు చేస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం అనేది బరువును నియంత్రించడంలో మేలు చేస్తుంది. ఈ జీడిపప్పును తీసుకోవటం వలన ఎక్కువ సేపు ఆకలి అనేది వేయదు. ఇది ఆకలిని కంట్రోల్ లో ఉంచుతుంది. దీంతో బరువును మెయింటైన్ చేస్తుంది. అలాగే ఈ జీడిపప్పు అనేది జీర్ణవ్యవస్థకు ఎంతో హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి బరువు పెరగనీయకుండా చూస్తుంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది