Ulcer in Stomach : ఈ ఆహారంతో కడుపులో అల్సర్స్ కి చెక్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ulcer in Stomach : ఈ ఆహారంతో కడుపులో అల్సర్స్ కి చెక్…!!

Ulcer in Stomach : ప్రస్తుతం చాలామంది కడుపులో అల్సర్స్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు కారణం స్మోకింగ్, కూల్ డ్రింక్స్, అధికంగా తీసుకోవడం, మసాలా ఆహారం తీసుకోవడం వలన ఈ సమస్య వస్తుంటుంది. కడుపులో అల్సర్లు ఉంటే తీవ్రమైన కడుపునొప్పి మంట వస్తూ ఉంటుంది. ఆహారం తీసుకున్న తీసుకోకపోయినా కడుపునొప్పి అనేది వస్తుంటుంది. ఒకసారి అల్సర్ వస్తే అది మళ్లీ మళ్లీ రావడానికి అవకాశం ఉంటుంది. కావున అల్సర్ వచ్చినవాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 February 2023,7:00 am

Ulcer in Stomach : ప్రస్తుతం చాలామంది కడుపులో అల్సర్స్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు కారణం స్మోకింగ్, కూల్ డ్రింక్స్, అధికంగా తీసుకోవడం, మసాలా ఆహారం తీసుకోవడం వలన ఈ సమస్య వస్తుంటుంది. కడుపులో అల్సర్లు ఉంటే తీవ్రమైన కడుపునొప్పి మంట వస్తూ ఉంటుంది. ఆహారం తీసుకున్న తీసుకోకపోయినా కడుపునొప్పి అనేది వస్తుంటుంది. ఒకసారి అల్సర్ వస్తే అది మళ్లీ మళ్లీ రావడానికి అవకాశం ఉంటుంది. కావున అల్సర్ వచ్చినవాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అల్సలతో ఇబ్బంది పడేవాళ్లు ఒకసారి అల్సర్ల బారిన పడిన వాళ్ళు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ అలసర్లు తగ్గడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏ ఆహారానికి దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Check for stomach ulcer with this food

Check for stomach ulcer with this food

ఈ లక్షణాలు కనిపిస్తాయి… కడుపులో అల్సర్లు ఉంటే సహజంగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. కడుపునొప్పితో పాటు ఈ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. రక్తహీనత, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఏదైనా తినగానే వాంతులు కావడం, కడుపుఉబ్బరం కాస్తంత తినగానే కడుపు నిండినట్లు అనిపించడం ఏమి తినకపోతే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే అకస్మాత్తుగా అర్ధరాత్రి కడుపు పైభాగంలో నొప్పి మంట వస్తూ ఉంటుంది. అల్సర్లు ఎలా ఏర్పడతాయి… నోటిలో ఉండే మృదువైన పొరను ఆ పొరలాంటి లైనింగ్ లాంటిది సుమారు ఆహారం ప్రయాణించే మార్గమంతా ఉంటుంది. ఆ మార్గం ఒరుసుకుపోతే వాటిని ఏరోజన్స్ అంటారు. ఈ ఘాట్లు మరింత లోతుగా ఉంటే వాటిని అల్సర్ అని చెప్తూ ఉంటారు. కడుపులో వచ్చే వాటిని కడుపు అల్సర్స్ అని అంటారు కడుపులో స్రవించే యాసిడ్ లోపలి లైనింగ్ లాంటిది.

సమయాన్ని తినకపోవడం స్మోకింగ్ లాంటి కారణాలవల్ల ముక్వోజ దెబ్బతింటుంది. ఎసిడిక్ ఆహారం : అల్సర్లతో ఇబ్బంది పడేవాళ్లు సిట్రస్ పండ్లు టమాటాలు లాంటి ఆహారంకి దూరంగా ఉండాలి. కడుపునొప్పిని ఎక్కువ చేస్తాయి. కడుపులో పుండ్లను పెంచుతాయి. కావున బయట ఆహారం తీసుకోవద్దు. శుభ్రమైన నీటిని తాగాలి.. ఇలా తినండి : అల్సర్ పేషెంట్స్ పూర్తి స్వాతిక భోజనం తీసుకోవాలి. సప్పటి ఆహారం తీసుకుంటే అది తగ్గిపోతాయి. తాలింపు వేసుకుని తీసుకోవాలి. మజ్జిగలో ప్రోబయోటిక్ అల్సర్ తగ్గడానికి ఉపయోగపడుతుంది.

గుమ్మడికాయ : గుమ్మడికాయ అల్సర్లకు ఉపయోగపడుతుంది. ఇది అల్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కార్య చర్యను పెంచుతాయి. అల్సర్స్ పేషెంట్ గుమ్మడికాయ తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. క్యారెట్ : అల్సర్లతో ఇబ్బంది పడేవారు క్యారెట్ తరచుగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. క్యాప్సికం ; క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి లోపం ఉన్నవాళ్లు అల్సర్లు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే కాఫీ, చాక్లెట్స్, మసాలాలు ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే ఈ అల్సర్ సమస్యను తగ్గించుకోవచ్చు…

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది