Coffee Powder : కాఫీ పొడితో ఊహించలేనంత మార్పు.. ఒక్క సారి ఇలా ట్రై చేయండి..
Coffee Powder : కాఫీ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. కాఫీ తాగకుంటే చాలా మందికి ఏమీ తోచదు.. మరి కొంత మందికి కాఫీ తాగనిదే అసలు డే స్టార్ట్ కాదు. కాఫీ తాగడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. దీని వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాఫీ పౌడర్ ను కేవలం తాగడానికే యూజ్ చేస్తారు అని అనుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ కాఫీ పౌడర్ ను ఉపయోగించి మీ చర్మం కాంతిని పెంచుకోవచ్చు ఒక్క సారి ఈ టిప్ ట్రై చేయండి మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు. కాఫీ పౌడర్ రుచితో పాటుగా చర్మాన్ని రక్షించడంలో చాలా ఉపయోగపడుతుంది.
దీనిని ఫేస్ ప్యాక్ గా చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.ఒక చిన్న కాఫీ ప్యాకెట్ ను తీసుకోండి అందులో కొంచెం అలోవేరా జెల్ కలపండి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఆరిపోయిన తర్వాత నీటితో మోహాన్ని కడుక్కోండి. ఇలా చేయడం వల్ల చర్మంపైన ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతి వంతంగా మారుతుంది. మొటిమలను తొలగించడంలోనూ ఇది సహాయపడుతుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే..
Coffee Powder : ఫేస్ ప్యాక్ ఇలా చేయండి
మూడు టీ స్ఫూన్ల కాఫీ పొడి తీసుకోవాలి, శెనగపిండి ఒక టీ స్ఫూన్, తేనే మూడు టీస్ఫూన్లు, కాస్త నూనె, అలోవేరా జెల్ రెండు టీ స్ఫూన్లు తీసుకుని వాటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత ఆ పేస్టును ముఖంపై ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. దాదాపుగా 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ సారి ఇలా ట్రై చేయండి.. ముఖాన్ని కాంతి వంతం చేసుకోండి.