Coffee Powder : కాఫీ పౌడర్ తో ఇలా చేస్తే చాలు.. పార్లర్ కు వెళ్లే అవసరమే ఉండదు…
Coffee Powder :కాఫీ తాగితే శరీరానికి ఉత్తేజం వస్తుంది. అది కాఫీ మీ అందాన్ని సైతం పెంచుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం… షణ్ముఖణాల పునరుత్పత్తికి కాఫీ గ్రౌండ్స్ బాగా పనిచేస్తుంది. దీన్ని స్క్రబ్ మాదిరిగా కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమంతో మీ చర్మంపై నిదానంగా గుండ్రంగా మర్దన మాదిరిగా చేయాలి. కాఫీ గ్రౌండ్స్ లో ఉండే కెసిక్ ఆసిడ్ కొల్లజన్ ఉత్పత్తిని పెంచుతుంది. నిద్ర లేకపోవడం వల్ల కంటిపై ఒత్తిడి పడడం వల్ల లేక ఇతర కారణాల వల్ల కళ్ళ దగ్గర నల్లటి వలయాలు ఏర్పడతాయి. కొందరిలో కళ్ళు ఉబ్బిపోతాయి. ఉదయాన్నే కాఫీ తాగగానే కప్పులో మిగిలిపోయిన కాఫీ గౌన్స్ ని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత కళ్ళ కింద అప్లై చేయండి. కాసేపు ఆగిన తర్వాత చల్లని తో కడిగేసుకోండి.
కాఫీఐస్ క్యూబ్స్ లో వేసి ఫ్రిజ్లో పెట్టండి. అవసరమైనప్పుడు ఆ క్యూబ్స్ ని తీసుకుని ముఖంపై మర్దన చేసుకోండి దీని వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఫ్రెష్ లుక్ వస్తుంది. కండిషనర్లు రెండు టీ స్పూన్ల గ్రౌండ్ కాఫీ ని కలిపి జుట్టుకి పట్టించాలి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి తర్వాత మీరు ఏ స్టైల్ లో కావాలంటే ఆ స్టైల్లో జుట్టుని దువ్వుకోవచ్చు.. మన కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలను కాఫీతోనే ఎలా పోగొట్టుకోవచ్చు ఇప్పుదు చూద్దాం.. కాఫీ పొడి కొబ్బరి నూనె ఈ రెండు కలిపి ప్యాక్ తయారు చేసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుందాం దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె కాఫీ పొడి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత వాష్ చేయండి. కొద్దిసేపు ఆగిన తర్వాత చల్ల నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత మీ ముఖం కాంతివంతంగా అలాగే ఎంతో మెరుపైన చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల మీకు అందమైన స్కిన్ మీ సొంతమవుతుంది.