Juices : రెగ్యులర్ గా ఈ జ్యూస్ లు తీసుకోండి… జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండి…!
ప్రధానాంశాలు:
Juices : రెగ్యులర్ గా ఈ జ్యూస్ లు తీసుకోండి... జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండి...!
Juices : మనం రోజు ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. అయితే అవి తిన్న తరువాత ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాకపోవటం వలన చాలామంది కడుపు సంబంధించిన సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు మందులు వాడిన ఈ సమస్యల నుండి పూర్తిగా కోలుకోలేరు. కానీ రెగ్యులర్ గా ఈ జ్యూస్ లు గనక తీసుకుంటే ఈ జీర్ణ సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జీర్ణక్రియల విషయంలో ఎన్నో స్మూతీలు కూడా సహాయం చేస్తాయి. వీటిలో కరిగే మరియు కరగని ఫైబర్లు అనేవి రెండు ఉంటాయి. ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయగలవు. కడుపులో తేలికగా ఉంచేందుకు చియా సీడ్ వాటర్ కు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అని చెప్పొచ్చు. ఇది డిటాక్స్ వాటర్ జీర్ణ సమస్యలకు బాగా పని చేస్తుంది. ఇది జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
మీరు గనక ఖాళీ కడుపుతో అల్లం టీ తీసుకుంటే చాలా మంచిది. ఖాలి కడుపుతో పాల టీ తాగటం కంటే అల్లం టీ ని తాగతే 100 రెట్లు మేలు చేస్తుంది. అంతేకాక కలబంద రసం కూడా కడుపుకు ఎంతో మేలు చేస్తుంది. ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వారు కూడా ఈ జ్యూస్ ను తీసుకున్నట్లయితే సమస్యలన్నీ కూడా పరిష్కరించవచ్చు. పైనాపిల్ జ్యూస్ కూడా కడుపు కి ఎంతో మేలు చేయగలదు. దీనిలో బ్రోమోలైన్ అనే ఉద్దీపనం ఉన్నది. ఇది జీర్ణక్రియకు ఎంతో తోడ్పడటంతో పాటు గ్యాస్ట్రీక్ సమస్యలను కూడా దూరం చేయగలదు..