Coriander Juice : కొత్తిమీర అనేది కేవలం ఆహారం రుచి మరియు అలంకరణ కోసం మాత్రమే కాక దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే దీనిని ప్రతి రోజు జ్యూస్ లా తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఈ కొత్తిమీర ఆకు, కాండం,వేరు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అంతేకాక ఈ కొత్తిమీర జ్యూస్ తీసుకోవటం వలన ఎన్నో వ్యాధులు కూడా దూరం చేయవచ్చు. అయితే ఈ కొత్తిమీరలో ఉండే యాంటీ మైక్రోబయాల్,యాంటీ మ్యూటాజెనిక్,యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు మూత్రపిండాల పనితీరును ఎంతో మెరుగుపరుస్తాయి. అంతేకాక డయేరియాకు కూడా కారణం అయ్యే బ్యాక్టీరియాని నాశనం చేయడంలో ఎంతో మేలు చేస్తాయి. ఈ కొత్తిమీర జ్యూస్ ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ఈ కొత్తిమీరలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలంగా చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే పరిగడుపున కొత్తిమీర జ్యూస్ ను తీసుకోవటం వలన రక్తపోటు కూడా కంట్రోల్ ల్లో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి అధికంగా ఉన్నాయి. అందుకే ఈ కొత్తిమీర రసాన్ని పరిగడుపున తీసుకున్నట్లయితే కీళ్లవాపులు, కీళ్ల నొప్పులు కూడా తగ్గు ముఖం పడతాయి.అయితే ఈ కొత్తిమీర రసాన్ని ప్రతిరోజు తీసుకోవటం వలన మూత్రపిండాలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే కడుపుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ కొత్తిమీర జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ కొత్తిమీర జ్యూస్ ను తీసుకోవటం వలన కడుపు నొప్పి నుండి కూడా ఎంతో ఉపసమనం కలిగిస్తుంది. అలాగే అసిడిటీ సమస్య ఉన్నవారు ఈ కొత్తిమీరతో పాటుగా జిలకర్ర మరియు టి ఆకులు మరియు పంచదార వేసుకొని మరిగించి ఈ నీటిని తీసుకోవటం వలన ఎసిడిటీ నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
మహిళలు పీరియడ్స్ కు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, టైంకి పీరియడ్స్ రానివారు లేక సాధారణ కంటే ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ కొత్తిమీర జ్యూస్ లో కొద్దిగా పంచదార కలిపి తీసుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ కొత్తిమీర జ్యూస్ తయారు చేసుకునేందుకు కొత్తిమీర,ఒక నిమ్మకాయ, ఉప్పు, కొన్ని నీళ్లు అవసరం. అలాగే కొత్తిమీర జ్యూస్ కోసం ముందు కొత్తిమీరను క్లీన్ చేసి,వాటిని కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దానిలో నిమ్మరసాన్ని మరియు ఉప్పు వేసి కలుపుకొని తాగితే చాలు. దీనిని ఇలా ప్రతినిత్యం కాళీ కడుపుతో తీసుకోవడం వలన ఎంతో ప్రయోజనం కలుగుతుంది…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.