Home » Exclusive » Samsung Galaxy Smart Ring
Exclusive

Smart Ring : మార్కెట్లోకి సాంసంగ్ స్మార్ట్ రింగ్… ఎంతో ఆకర్షనీయంగా… సరికొత్త ఫ్యూచర్స్ తో…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 17, 2024 9:40 pm
Advertisement

Smart Ring : ప్రస్తుతం మారుతున్న సాంకేతిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సరికొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తుంది. దానికి అనుగుణంగానే సరికొత్త టెక్నాలజీతో వివిధ రకాల గడ్జెట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ప్రస్తుత కాలంలో ఈ ట్రెండ్ మరింత విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరగడంతో…దానికి అనుగుణంగా స్మార్ట్ యాక్సెసరీస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ వాచ్, ఫిట్నెస్ ట్రాక్టర్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి స్మార్ట్ రింగులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ తయారీసంస్థ సాంసంగ్ ఒక స్మార్ట్ రింగ్ ను లాంచ్ చేయడం జరిగింది. ఇటీవల జరిగిన సాంసంగ్ అన్ ప్యాకెడ్ 2024 ఈవెంట్లో భాగంగా ఈ స్మార్ట్ రింగును మార్కెట్లోకి విడుదల చేశారు.

Advertisement

అయితే ఈ ఈవెంట్లో స్మార్ట్ రింగు మాత్రమే కాకుండా వివిధ రకాల వాచ్ లు, స్మార్ట్ ఫోన్స్ , ఇయర్ బర్డ్స్ తో పాటు ఇతర డివైస్లను కూడా సాంసంగ్ కంపెనీ విడుదల చేయడం జరిగింది. వీటిలో సాంసంగ్ తీసుకు వచ్చిన కొత్త రింగ్ విషయానికి వచ్చినట్లయితే..మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడే లక్ష్యంతో ఈ స్మార్ట్ రింగ్ డెవలప్ చేశారు. ఇక ఈ స్మార్ట్ రింగ్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచడంతోపాటు మిమ్మల్ని ఫిట్ గా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.

Smart Ring స్మార్ట్ రింగ్ ధర…

Smart Ring : మార్కెట్లోకి సాంసంగ్ స్మార్ట్ రింగ్… ఎంతో ఆకర్షనీయంగా… సరికొత్త ఫ్యూచర్స్ తో…!

Advertisement

ఇక ఈ స్మార్ట్ రింగ్ ధర విషయానికొస్తే 399 డాలర్లు అంటే దాదాపు 34 వేల రూపాయలు… ఇక ఈ స్మార్ట్ రింగు జులై 10 2024 నుండి ఫ్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. కావున ఈ స్మార్ట్ రింగును జూలై 24 2024 నుండి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ రింగు స్మార్ట్ వాచ్ మాదిరిగానే మీ యొక్క ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ లను అంచనా వేయగలదు. ఇక ఈ స్మార్ట్ రింగ్ మనకు 9 వేర్వేరు సైజుల్లో మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్ మరియు టైటానియం గోల్డ్ కలర్స్ లో ఈ స్మార్ట్ రింగ్ మనకు అందుబాటులో ఉంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి