
Curry leaves benefit of hair In Telugu
Curry Leaves : జుట్టు రాలకుండా ఒత్తుగా, దృఢంగా పెరగాలంటే ఈ ఆకుని ఇలా వాడండి చాలు.. కరివేపాకు ని మనం ఎక్కువగా వంటల్లో వేస్తాం.. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. అయితే కరివేపాకు చేదుగా ఉండడం కారణంగా దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటారు.. కానీ దీన్ని తింటే మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే కరివేపాకు వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శిరోజాలను కూడా రక్షించుకోవచ్చు. అయితే శిరోజ సంరక్షణకు కరివేపాకును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. తాజా కరివేపాకును కొబ్బరి నూనె ఒక గిన్నెలో తీసుకోవాలి. రెండింటిని కలిపి నలుపు రంగు మిశ్రమం వచ్చేవరకు మరిగించాలి. చల్లబరిచి జుట్టుకుదురులకు పట్టించాలి. ఒక గంట సేపు ఇలా ఉంచాలి.
అనంతరం తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు చొప్పున 15 నుంచి నెల రోజుల పాటు ఇది వాడితే మంచి ఫలితం కనిపిస్తోంది.. ఈ మిశ్రమం జుట్టు త్వరగా తెల్లబడడం లేకుండా చేస్తుంది.అలాగే ఒక ఎయిర్ మాస్క్ కూడా చూద్దాం.దీనికోసం కొద్దిగా కరివేపాకు ఆకులను తీసుకొని వాటిని మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని గడ్డ పెరుగుతో కలిపి జుట్టుకు కట్టించాలి. 20 నుంచి 25 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తరువాత తల స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే వెంట్రుకల పెరుగుదలలో ఆశించిన స్థాయిలో ఫలితం కనిపిస్తోంది. కరివేపాకు టీ. నీటిలో కరివేపాకు ఆకులను మరిగించి ఆ రసానికి నిమ్మరసం చక్కెర కలపాలి. దీన్ని రోజు వారం పాటు తాగాలి. ఇదే శిరోజాల అభివృద్ధిని పెంచుతుంది.
ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు కూడా కరివేపాకును ఇలా ఉపయోగిస్తూ మీ జుట్టు రాలకుండా నల్లగా, దృఢంగా ఉండేలా చూసుకోండి… అలాగే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఐదారు కరివేపాకు ఆకుల్ని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు జుట్టు సంరక్షణ కోసం చాలా బాగా సహాయపడుతుంది..
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.