Curry Leaves : కరివేపాకుతో ఇలా చేస్తే మీ జుట్టు ఊడకుండా దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Curry Leaves : కరివేపాకుతో ఇలా చేస్తే మీ జుట్టు ఊడకుండా దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది…!

Curry Leaves : జుట్టు రాలకుండా ఒత్తుగా, దృఢంగా పెరగాలంటే ఈ ఆకుని ఇలా వాడండి చాలు.. కరివేపాకు ని మనం ఎక్కువగా వంటల్లో వేస్తాం.. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. అయితే కరివేపాకు చేదుగా ఉండడం కారణంగా దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటారు.. కానీ దీన్ని తింటే మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే కరివేపాకు వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శిరోజాలను కూడా రక్షించుకోవచ్చు. అయితే శిరోజ […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Curry Leaves : కరివేపాకుతో ఇలా చేస్తే మీ జుట్టు ఊడకుండా దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది...!

  •  Curry Leaves : జుట్టు రాలకుండా ఒత్తుగా, దృఢంగా పెరగాలంటే ఈ ఆకుని ఇలా వాడండి చాలు..

Curry Leaves : జుట్టు రాలకుండా ఒత్తుగా, దృఢంగా పెరగాలంటే ఈ ఆకుని ఇలా వాడండి చాలు.. కరివేపాకు ని మనం ఎక్కువగా వంటల్లో వేస్తాం.. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. అయితే కరివేపాకు చేదుగా ఉండడం కారణంగా దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటారు.. కానీ దీన్ని తింటే మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే కరివేపాకు వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శిరోజాలను కూడా రక్షించుకోవచ్చు. అయితే శిరోజ సంరక్షణకు కరివేపాకును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. తాజా కరివేపాకును కొబ్బరి నూనె ఒక గిన్నెలో తీసుకోవాలి. రెండింటిని కలిపి నలుపు రంగు మిశ్రమం వచ్చేవరకు మరిగించాలి. చల్లబరిచి జుట్టుకుదురులకు పట్టించాలి. ఒక గంట సేపు ఇలా ఉంచాలి.

అనంతరం తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు చొప్పున 15 నుంచి నెల రోజుల పాటు ఇది వాడితే మంచి ఫలితం కనిపిస్తోంది.. ఈ మిశ్రమం జుట్టు త్వరగా తెల్లబడడం లేకుండా చేస్తుంది.అలాగే ఒక ఎయిర్ మాస్క్ కూడా చూద్దాం.దీనికోసం కొద్దిగా కరివేపాకు ఆకులను తీసుకొని వాటిని మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని గడ్డ పెరుగుతో కలిపి జుట్టుకు కట్టించాలి. 20 నుంచి 25 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తరువాత తల స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే వెంట్రుకల పెరుగుదలలో ఆశించిన స్థాయిలో ఫలితం కనిపిస్తోంది. కరివేపాకు టీ. నీటిలో కరివేపాకు ఆకులను మరిగించి ఆ రసానికి నిమ్మరసం చక్కెర కలపాలి. దీన్ని రోజు వారం పాటు తాగాలి. ఇదే శిరోజాల అభివృద్ధిని పెంచుతుంది.

ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు కూడా కరివేపాకును ఇలా ఉపయోగిస్తూ మీ జుట్టు రాలకుండా నల్లగా, దృఢంగా ఉండేలా చూసుకోండి… అలాగే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఐదారు కరివేపాకు ఆకుల్ని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు జుట్టు సంరక్షణ కోసం చాలా బాగా సహాయపడుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది