Kids Riotous Behaviour : ఎంతటి మొండి పిల్లలు అయినా మీ మాట వినాల్సిందే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kids Riotous Behaviour : ఎంతటి మొండి పిల్లలు అయినా మీ మాట వినాల్సిందే..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 March 2023,10:00 pm

Kids Riotous Behaviour : పిల్లలు వయసు ఎంత ఉన్నా సరే పెళ్లయిన సరే తల్లిదండ్రులు మాట వినాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. సక్రమంగా ఎదగాలని ప్రతి ఇంట్లో కోరుకుంటూ ఉంటారు. మాట వినట్లేదు మొండిగా తయారవుతున్నారు. కనీసం దేవుడికి దండం పెట్టుకోవాలి అని చెప్పినా సరే చేయని విధంగా తయారవుతున్నారు. అలాంటి పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే ఈ రెమిడి కనక చేస్తే వాళ్ళు తప్పకుండా మార్పు అనేది వస్తుంది. పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇప్పుడున్న టెక్నాలజీకి మొబైల్స్ కి అలవాటు కావడం, టీవీకి అలవాటు కావడం ఈ ఎలక్ట్రానిక్ వస్తువులతో బాగా అలవాటు పడిపోయి పిల్లలు మొండిగా తయారవుతున్నారు. ఈ సమస్యతో చాలామంది తల్లిదండ్రులు సతమతమవుతూ ఉన్నారు.

Datta Tantram For Kids Remedy For Kids Riotous Behaviour

Datta Tantram For Kids Remedy For Kids Riotous Behaviour

పిల్లల్లో ఆ మొండితనం పోయి సక్రమంగా తయారవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.కొంతమంది తల్లిదండ్రులు సైకాలజిస్ట్ల్ దగ్గరికి కూడా తీసుకెళ్లి చెకప్ లు చేస్తూ ఉంటారు. పిల్లల్లో మార్పులు రావడం కోసం మన పాతకాలనాటి పెద్దలు ఒక దత్త మంత్రం తెలియజేయడం జరిగింది. సాధారణంగా మంత్రాలకు చింతకాయలు రాలవు అని అంటూ ఉంటారు. కానీ ఈ దత్త మంత్రం కనుక పాటిస్తే తప్పకుండా పిల్లలు మార్పు వస్తుంది. ఏ వయసు పిల్లలైనా సరే మీ మాట విని తీరాల్సిందే. అయితే ఈ మంత్రం మాత్రం కేవలం తల్లిదండ్రులు వారి పిల్లలకు మాత్రమే చేయవలసిన మంత్రం. అయితే పెళ్లి కాని పిల్లల వరకు ఈ తంత్రం ఉపయోగించవచ్చు. ఈ మంత్రం పాటించి అద్భుతమైన ఫలితాలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ దత్త మంత్రం ఏ విధంగా ఉపయోగించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దీనికోసం ముందుగా ఒక రాగి చెంబు ని తీసుకోవాలి.అయితే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే విడివిడిగా ఈ దత్త మంత్రం చేయాలి. ఈ సంతానంలో మొండితనాన్ని పోగొట్టడానికి ఈ దత్త తంత్రంలో మీరు ఉపయోగించాల్సినటువంటి మొదటి వస్తువు రాగి పాత్ర ఇందులో స్వచ్ఛమైన నీటిని తీసుకోండి. ఇప్పుడు ఆ నీటిలో ఒక స్పూను పసుపు వేసి బాగా కలిపి ఆ నీటిని మీ పిల్లలు పడుకునే మంచం కింద దానిని పెట్టి మీరు సంకల్పం చెప్పుకోవాలి. మీ పిల్లల్లో ఎటువంటి లక్షణం పోయి మార్పు రావాలనుకుంటారో దానిని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పుకునేటప్పుడు శ్రీ దత్త రక్ష గురవే నమః అని మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని మీకు ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకోవచ్చు.

VicHealth | Kids in Communities Study

ఈ విధంగా చెప్పుకోవడం వలన మీకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక ఆ నీటిని మర్నాడు తీసి వాటిని తీసి దిష్టి తీసిన విధంగా పిల్లాడికి కుడివైపున చేయడం వైపుకి పైనుంచి కిందకి మూడు మూడు సార్లు శ్రీ దత్త రక్షకుడు నమః అని మంత్రం జపిస్తూ పిల్లల్ని పసుపు నీటిని చూడమని చెప్తూ ఇలా తీయాల్సి ఉంటుంది. తర్వాత ఆ నీటిని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పోయాలి. ఒకవేళ మీకు రావి చెట్టు అందుబాటులో లేకపోతే ఏదైనా పచ్చని చెట్టుకి పోసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మీ దత్త మంత్రం పూర్తవుతుంది. అయితే దీనిని బుధవారం నాడు చేయాలి. గురువారం నాడు ఆ నీటిని రావి చెట్టుకి పోయాలి. ఈ విధంగా చేయడం వలన మీ పిల్లాడిలో అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది