Diabetes : షుగర్ బాధితులు నిత్యం బ్రౌన్ రైస్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా. తీసుకునే ముందు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : షుగర్ బాధితులు నిత్యం బ్రౌన్ రైస్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా. తీసుకునే ముందు…

 Authored By aruna | The Telugu News | Updated on :28 August 2022,5:00 pm

Diabetes : భారతదేశంలో సుమారుగా సగం మంది పైగా.. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో రైస్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చాలామంది అన్నం వైట్ గా ఉంటే గాని తినరు. అయితే వాస్తవానికి బ్రౌన్ రైస్ బాగా పాలిష్ చేయడం వలన వైట్ రైస్ గా మారిపోతున్నాయి. బ్రౌన్ రైస్ ని పాలిష్ చేయడం వల్ల దానిపై ఉండే పొర తొలగిపోయి అలాగే అందులో ఉండే ఎన్నో రకాల పోషకాలు కూడా పోతుంటాయి. కాబట్టి పాలిష్ వేయని రైస్ ని తీసుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇండియాలో ఎన్నో రకాల రైసులు కనిపిస్తూ ఉంటాయి. వాటిని ప్రతి ఇంట్లో ఏదో ఒక విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. రైస్ లో ఉండే ఎన్నో రకాల పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తూ ఉంటాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే రకరకాల వైట్ రైస్ ప్రస్తుతం బాగా పాలిష్ వేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి వలన పోషకాలు మొత్తం ఎగిరిపోయి. నిసారమైన పిండి పదార్థం మాత్రమే మిగులుతోంది. అదేవిధంగా రైస్ ని పాలిష్ వేసేటప్పుడు ఉపయోగించి కొన్ని కెమికల్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అయితే ముడి బియ్యం తీసుకోవడం వలన ఎన్నో రకాల వ్యాధులు నుండి బయటపడవచ్చు.

క్యాన్సర్ : రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, దంత క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, లాంటి ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తీసుకోవచ్చు. ఈ రైస్లో ఐనాసిటాల్ , హేగ్జా పాస్పెట్, అని సాధారణమైన సమ్మేళనం దీనిలో కలిగి ఉంటుంది. అలాగే డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వలన వక్షోజా పేగుల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ ముడి బియ్యం లో ఉండే పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. గుండెకు శ్రేయస్కరం : ముడి బియ్యం తీసుకోవడం వలన కార్డియాక్ అరెస్ట్ గుండెపోటు లాంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతాయి.అలాగే అధిక బరువు ఉన్నవారికి ముడి బియ్యం తినమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Diabetes Benefits Of Brown Rice For Diabetic People

Diabetes – Benefits Of Brown Rice For Diabetic People

మధుమేహం : పాలిష్ చేసిన రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. అలాగే వీటితో వండిన అన్నాన్ని తీసుకున్నట్లయితే శరీరంలో రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పదేపదే పెరిగిపోతూ ఉంటాయి. కానీ ముడి బియ్యం లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ అన్నం తీసుకోవడం వలన చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. కాబట్టి ముడి బియ్యం మధుమేహం ఉన్నవారు కి బాగా సహాయపడతాయి. అలాగే మధుమేహం లేని వారికి కూడా ఈ రైస్ ని ప్రతిరోజు తీసుకోవడం వలన డయాబెటిస్ వచ్చి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వుని కరిగిస్తుంది : ముడి బియ్యం కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అదే కాకుండా ఈ బియ్యం వాడడం వలన మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా పెరుగుతాయి. అలాగే దీనిని వాడడం వల్ల శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ రైస్ నిత్యము తీసుకోవడం వలన స్థూలకాయాన్ని తగ్గించడం, శరీరంలోని తీవ్రమైన నొప్పిని, షుగర్ వ్యాధిని కూడా తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది