Diabetes : మల్బరీ చెట్టు పండ్లతో… డయాబెటిస్ కు చెక్ పెట్టండి ఇలా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : మల్బరీ చెట్టు పండ్లతో… డయాబెటిస్ కు చెక్ పెట్టండి ఇలా…

 Authored By aruna | The Telugu News | Updated on :22 August 2022,5:00 pm

Diabetes : పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అలాంటి పండ్లలో ఒకటే మల్బరీ పండ్లు. ఈ పండ్లు చూడడానికి చిన్న సైజులో ఉన్నా ఇవి చేసే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఈ పండ్లతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి ఉంటాయి. వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. ప్రస్తుతం డయాబెటిస్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అలాంటివారు తినే ఆహారం వీటిని తీసుకోవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే బరువు కూడా కంట్రోల్ లో ఉంచేలా మల్బరీ పండు సహాయపడుతుంది.

మల్బరీ పండ్లలో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. వారానికి నాలుగు సార్లు ఈ పండును తీసుకుంటే కంటి చూపు పెరుగుతుంది. వీటిని తరచుగా తీసుకోవడం వలన అధిక రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ని తగ్గించడంలో ఈ పండ్లు ఎంతగానో సహాయపడతాయి. ఈ పండ్ల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటుంది. కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది. మల్బరీ పండ్లలో అనేక పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

Diabetes Health Benefits Of Mulberry Fruits For Diabetic People

Diabetes Health Benefits Of Mulberry Fruits For Diabetic People

చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల వచ్చే బరువు నియంత్రించడంలో మల్బరీ ఉపయోగపడుతుంది. మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి వాటిని నివారిస్తాయి. మల్బరీ పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉండడం వలన ఎర్ర రక్త కణాల పెరుగుదల శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది