Diabetes Patients : మీకు షుగర్ ఉందా? హెల్త్ కోసం గుడ్లను తెగ తినేస్తున్నారా? మీరు డేంజర్ లో ఉన్నట్టే
Diabetes Patients : గుడ్ల గురించి తెలుసు కదా. ఎగ్స్ ఎంత తింటే అంత మంచిది. ముఖ్యంగా ఉడకబెట్టిన కోడిగుడ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతుంటారు. ఎగ్స్ లో విటమిన్స్, సెలీనియం, క్యాల్షియం, జింక్ లాంటి ఎన్నో ఖనిజాలు, విటమిన్స్, ప్రొటీన్స్ ఉంటాయి. ఒక్క ఉడకబెట్టిన గుడ్డు తింటే ఇవన్నీ శరీరానికి అందుతాయి.అందుకే పిల్లలకు, పెద్దలకు అందరికీ గుడ్డును ఎక్కువగా పెడుతుంటారు. మెదడు చురుకుగా ఉండాలన్నా.. ఎముకలు దృఢంగా మారాలన్నా ఖచ్చితంగా గుడ్డును తినాల్సిందే. అయితే..
గుడ్లను మితంగా తింటేనే మంచిది. అలాగే కొన్ని రకాల వ్యాధులు ఉన్నవాళ్లు మాత్రం గుడ్లకు దూరంగా ఉండాలట. ఎక్కువగా గుడ్లను తీసుకుంటే లేనిపోని రోగాలు వస్తాయట.ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు గుడ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడిగుడ్డులో ఉండే పచ్చ సొన చాలా డేంజర్. ఎక్కువ పచ్చసొన తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్టరాల్ పెరుగుతుంది.
Diabetes Patients : డయాబెటిస్ రోగులు గుడ్లకు దూరంగా ఉండాల్సిందే
అది డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు అస్సలు మంచిది కాదు.షుగర్ ఉన్నవాళ్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగితే దాని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉడకబెట్టిన గుడ్లను డైరెక్ట్ గా తినకుండా.. కొంచెం ఉప్పు, కొత్తిమీర, మిరియాల పొడి వేసుకొని తింటే మంచిది. ఏది ఏమైనా.. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎక్కువగా కోడిగుడ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. తిన్నా మితంగా తినాలి. కోడిగుడ్డులోని పచ్చ సొనను వీలైనంతగా తగ్గించాలి.