Carrot : షుగర్ ఉన్నవాళ్లు క్యారెట్ తింటే జరిగేది ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Carrot : షుగర్ ఉన్నవాళ్లు క్యారెట్ తింటే జరిగేది ఇదే…!

 Authored By jyothi | The Telugu News | Updated on :24 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Carrot : షుగర్ ఉన్నవాళ్లు క్యారెట్ తింటే జరిగేది ఇదే...!

Carrot  : క్యారెట్లు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా క్యారెట్ లో బీటా కెరోటిన్ అనేది బాగా ఉంటుంది. ఇది మన శరీరం లోపలికి ముఖ్యంగా లివర్ లోకి వెళ్ళిన తర్వాత వెంటనే అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లా ఉపయోగపడుతుంది. ఆంటీ ఆక్సిడెంట్ అంటే మన కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది. అందరికీ క్యారెట్లు మంచిది అని తెలుసు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్లు షుగర్ పేషెంట్లు తినొచ్చా.. తినకూడదా.. అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డయాబెటిస్ వచ్చినవారు డైట్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. తీసుకునే ఆహారంపై సరైన అవగాహన అవసరం. ఈ వ్యాధి వచ్చిందంటే చాలు అప్రమత్తం అవ్వాల్సిందే.. ఎందుకంటే ఈ వ్యాధి కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడతాయి.

కాబట్టి ఈ సమస్యకు కారణమయ్యే ఆహార పదార్థాలను దూరం పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మరి షుగర్ వచ్చిన వారు క్యారెట్ తినొచ్చా.. తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయలలో ఇది ఒకటి.దీనిని తినడం వల్ల దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చూడగానే ఎర్రగా నోరూరించే ఈ వెజిటేబుల్స్ పెద్దలు, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు. తియ్యగా ఉండే ఈ కూరగాయని ఊరికే తింటూ ఉంటారు అందరూ.. మరి కొంతమంది సలాడ్లో వేసుకొని జ్యూసెస్ లో స్వీట్స్ లో వేసుకొని తింటూ ఉంటారు. అయితే షుగర్ వ్యాధి వచ్చినవాళ్లు క్యారెట్ తీసుకోవడం మంచిదని చెప్తూ ఉంటారు. ఇందులో నిజం ఉంది. అయితే అతిగా తినడం అంత మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యారెట్లు షుగర్ కంటెంట్, ఐ గ్లిజరిన్ ఉంటుంది.

ఇది గ్లూకోజ్ గా మారడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వీటిని షుగర్ పేషెంట్లు ఎక్కువగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. షుగర్ పేషెంట్లు ఈ క్యారెట్ లను అధికంగా తీసుకుంటే ఇరిటేషన్, నిద్రలేమి, నీరసం ఎక్కువగా రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది