Drinking Water : నీటిని ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలను ఎదుర్కోవాల్సిందే…
ప్రధానాంశాలు:
Drinking Water : నీటిని ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలను ఎదుర్కోవాల్సిందే...
Drinking Water : భూ ప్రపంచంలో నీరు లేకుండా ఏ జీవులు జీవించలేవు. అదేవిధంగా ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతి వ్యక్తి రోజులో కొంత మొత్తంలో నీరుని తీసుకోవాలి. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం వలన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజులో ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవడం వలన ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నీటిని తక్కువ తీసుకోవడం శరీరానికి హానికరం అయినప్పటికీ ఎక్కువ నీటిని తీసుకోవడం కూడా హానికరమే. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం… శరీరంలో నీరు తక్కువ అయితే డిహైడ్రేషన్ అవుతుంది. అలాగే శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. సాధారణంగా ఓవర్ హైడ్రేషన్ రెండు కారణాల వల్ల సంభవిస్తుంది. అవి ఏమిటంటే నీరు ఎక్కువగా తాగడం మరియు మూత్రపిండాలు నీటిని నిలుపుకోవడం. దీనివలన శరీరంలో సోడియం తగ్గుతుంది. దీనినే అల్పోష్ణస్థితి అని అంటారు. అంతేకాదు రక్తంలోని ఎలక్ట్రోలైట్స్ పలచబడతాయి.
శరీరంలోకి నీరు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ మరియు పోషకాలను అందించి ఉష్ణోగ్రతను నియంత్రించడం జరుగుతుంది. అదేవిధంగా శరీరం నుండి అనవసరమైన పదార్థాలలో తొలగించడానికి నీరు ఎంతో అవసరం అవుతుంది. మూత్రపిండాలు మరియు కాలుష్యంతో ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక నీరు శరీర కణాలను తేమగా ఉంచడానికి ఉపయోగపడడంతో పాటుగా శరీరంలోని అవాంఛిత పదార్థాలతో మూత్రం ద్వారా అదనపు నీరు శరీరం నుండి తొలగిస్తాయి.
ఇలా జరగని నేపథ్యంలో శరీరంలోని మీరు అధికంగా పేరుకుపోవడం జరుగుతుంది. దీని వలన శరీరం దెబ్బతింటుంది. ఒకవేళ శరీరంలో అధిక మోతాదులో నీరు ఉన్నట్లయితే వికారం కండరాల ఉద్రిక్తత తలనొప్పి మరియు మైకము వంటివి అనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో నీరు అధికంగా ఉన్నప్పుడు ప్రారంభ సంకేతాలను గుర్తించడం కష్టమవుతుంది. దీంతో శరీర భాగాలలో కాళ్లు మరియు చేతులు వాపుకు కారణమవుతాయి.
ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగినట్లయితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక పరిస్థితులు మెదడు కణాల వాపుకు కారణమవుతాయి. అయితే నాడీ వ్యవస్థ రుగ్మతల వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లయితే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.