Hair Tips : పది నిమిషాల్లో తెల్లజట్టు మొత్తం నల్లగా మారిపోతుంది
Hair Tips : మార్నింగ్ లేవగానే ఓ కప్పు కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కాఫీ తాగి డే స్టార్ట్ చేస్తారు. మైండ్ రిఫ్రెష్ కోసం మాత్రమే తాగుతున్నాం అనుకుంటారు. కానీ కాఫీ కేవలం తాగటానికే కాదు కాఫీ పొడితో చర్మానికి, జుట్టుకు ఎంత మేలు చేస్తుందో తెలియదు. కాఫీ పొడితే ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ లో చక్కటి గ్లో వస్తుంది. అలాగే జుట్టుకు కూడా చక్కటి నిగారింపు వస్తుంది. కాఫీ పొడిలో ఉండే యాంటిఆక్సిడెంట్స్ జుట్టుకు హాని కలిగించే ప్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. అలాగే కుదుళ్లను బలంగా చేస్తుంది. ఇది తెలియక చాలా మంది కెమికల్స్ తో ఉండే రకరకాల షాంపులు, హెయిర్ అయిల్స్, రంగులు వాడుతుంటారు. ఇవి జుట్టుకి మేలు చేయడం
కన్నా ఎక్కువగా హాని చేస్తాయి.అయితే కాఫీ పొడి రక్త ప్రసరణను మెరుగుపరచటంతో జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను గట్టిపరుస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ యొక్క ప్రభావాలను తిప్పికొడుతుంది. కాబట్టి మీరు కాఫీ తాగినా లేదా మీ హెయిర్ మాస్క్‌కు జోడించినా మంచి ఫలితం ఉంటుంది.ఒక గిన్నెలో గ్లాస్ వాటర్, ఒకటిన్నర స్పూన్ కాఫీ పౌడర్, అర స్పూన్ లవంగాల పొడి వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి తలకి, కుదుళ్లకి అప్లై చేయాలి. ముప్పై నిమిషాల తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా చేస్తే జుట్టు నల్లగా, కాంతివతంగా మారుతుంది.

white hair to black permanently in 60 minutes naturally
Hair Tips : ఈ చిట్కా పాటించి చూడండి..
అలాగే ఒక గిన్నెలో నాలుగు స్పూన్ల కాఫీ పౌడర్, కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కుదుళ్లకు, జుట్టుకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. గంట తర్వాత గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి. నాలుగు రోజులకు ఒక సారి ఇలా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు నల్ల బడుతుంది.అలాగే ఉసిరి కూడా జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. కొబ్బరి నూనే కూడా జుట్టుకు కావల్సిన పోషణను అందించి తేమగా ఉంచుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, ఉసిరి పొడి, ఒక స్పూన్ కొబ్బరి నూనేను తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీటిని కలిపి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకి, కుదుళ్లకి పట్టించాలి. తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరుచు చేస్తుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. బలంగా కూడా అవుతుంది.