Eye : మీకు పదేపదే కన్ను అదురుతుందా… దీనికి కారణం ఏమిటి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eye : మీకు పదేపదే కన్ను అదురుతుందా… దీనికి కారణం ఏమిటి…!

Eye : సాధారణంగా మనలో ఎంతో మందికి అప్పుడప్పుడు కన్ను అదరటం అనేది సహజం. ఇలా కన్ను అదిరినప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటాం. కన్ను అదరటం అనేది ముందు జరగబోయే దానికి సంకేతం కావచ్చు అని భావిస్తూ ఉంటాం. ఇలా కన్ను అదరడం అనేది కొన్నిసార్లు మంచి సంకేతం అని అంటారు. కొన్నిసార్లు మాత్రం చెడుగా భావిస్తూ ఉంటారు. ఈ కన్ను అదరటం మగవారిలోనూ మరియు ఆడవారిలోని వేరువేరుగా ఉంటుంది. అయితే ఆడవారికి కుడి […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Eye : మీకు పదేపదే కన్ను అదురుతుందా... దీనికి కారణం ఏమిటి...!

Eye : సాధారణంగా మనలో ఎంతో మందికి అప్పుడప్పుడు కన్ను అదరటం అనేది సహజం. ఇలా కన్ను అదిరినప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటాం. కన్ను అదరటం అనేది ముందు జరగబోయే దానికి సంకేతం కావచ్చు అని భావిస్తూ ఉంటాం. ఇలా కన్ను అదరడం అనేది కొన్నిసార్లు మంచి సంకేతం అని అంటారు. కొన్నిసార్లు మాత్రం చెడుగా భావిస్తూ ఉంటారు. ఈ కన్ను అదరటం మగవారిలోనూ మరియు ఆడవారిలోని వేరువేరుగా ఉంటుంది. అయితే ఆడవారికి కుడి కన్ను అదిరినట్లయితే లేనిపోని సమస్యలు వస్తాయని అంటుంటారు. మగవారికి మాత్రం ఎడమ కన్ను అదిరితే మంచిది అని అంటారు. అయితే ఆడవారికి కుడి కన్ను అదిరితే మంచిదని కొంతమంది నమ్ముతారు. ఇంతకీ ఈ కన్ను అదరటం అనేది లాభమా నష్టమా. ఏ కన్ను అదిరితే ఎవరికీ మంచి జరుగుతుంది అనేది చాలామందికి ప్రశ్నార్థకంగా ఉంది. ఏ కన్ను అదిరితే ఎవరికీ మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కన్ను అదరటం అనేది కన్ను యొక్క నియంత్రణ కోల్పోయినప్పుడు దానంతట అదే అదురుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆడవారికి కుడి కన్ను అదిరితే అరిష్టం అని మగవారికి ఎడమ కన్ను అదిరితే దరిద్రం అని భావిస్తారు. అయితే ఆడవారికి ఎడమ కన్ను కొట్టుకోవడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అంతేకాక ఆడవారికి ఎడమ కన్ను అదిరితే జీవితం సంతోషంగా ఉంటుంది అని అంటారు. అలాగే ఊహించిన అదృష్టం కూడా కలిసి వస్తుంది అని నమ్ముతారు. ఇక మగవారికి మాత్రం కుడి కన్ను అదిరితే వారి చిరకాల వాంఛ నెరవేరుతుందని నమ్ముతారు. అయితే వారికి ఇష్టమైన వారిని కలవటం లేక ఏదైనా అదృష్టం కలిసి రావడం లాంటివి జరుగుతాయి. అదే పురుషులకు ఎడమ కన్ను అదిరితే దురదృష్టంగా భావిస్తారు. అయితే మగవారిలో ఎడమ కన్ను అదిరితే ఊహించని ఇబ్బందులు కలుగుతాయని అంటారు. కానీ ఇవన్నీ కూడా నిజం కాదు అని కేవలం శారీరక ఇబ్బందుల వలన కన్ను అదరటం జరుగుతుంది అని శాస్త్రవేత్తలు మరియు పరిశోధనలు తెలిపాయి. కన్ను అదరటానికి ఎన్నో రకాల శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. కన్ను అదరటానికి కళ్ళు అనేవి పొడిబారటం, కంటిలో అలర్జీ, నీరసం,ఒత్తిడి, ఆల్కహాల్ తాగటం లాంటి లాజికల్ కారణాలు ఎన్నో ఉన్నాయి అని అంటున్నారు. అయితే మెదడు లేక నరాల లోపాల వలన కన్ను అనేది అదురుతుంది. అయితే ఇది అనేది చాలా అరుదైన లక్షణం అని అంటున్నారు…

Eye మీకు పదేపదే కన్ను అదురుతుందా దీనికి కారణం ఏమిటి

Eye : మీకు పదేపదే కన్ను అదురుతుందా… దీనికి కారణం ఏమిటి…!

ఎంతోమందిలో అధిక ఒత్తిడి వలన కన్ను అదరడం జరుగుతుంది. అయితే టీవీ చూడటం, మొబైల్ చూడటం, ల్యాప్ టాప్ చూసిన కన్ను అనేది అధిక ఒత్తిడికి గురవుతుంది. కావున మధ్య మధ్యలో మీ కళ్ళకు విశ్రాంతి ఇవ్వటం ఎంతో అవసరం అని నిపునులు అంటున్నారు. అంతేకాక మరికొందరిలో నిద్రలేమి కారణంగా కూడా కన్ను అనేది అదురుతుంది. అయితే ప్రతి మనిషికి కనీసం ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర అనేది చాలా అవసరం. కావున నిద్రను దూరం చేసి కళ్ళపై ఒత్తిడి పంచకండి. ఇది కంటి ఆరోగ్యానికి కూడా హాని కలిగించవచ్చు. అలాగే కాఫీ లేక అధిక చాక్లెట్లు తినే వారిలో కూడా ఈ సమస్య అనేది ఉంటుంది. ఈ సమస్యను తగ్గించాలంటే కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకోకపోవడం మంచిది అని అంటున్నారు నిపునులు. అయితే ఒత్తిడి లేకుండా మరియు బాగా నిద్రపపోతు కెఫిన్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉన్నట్లయితే కళ్ళను రక్షించుకోవచ్చు. మీ కన్న గనుక పదే పదే పదురుతున్నట్లయితే మంచికే అని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించండి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది