EYE : కంటి చూపు పెరగాలని ఇది ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం తప్పదు..!!
ప్రధానాంశాలు:
EYE : కంటి చూపు పెరగాలని ఇది ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం తప్పదు..!!
EYE : మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో ఒకటి మన కళ్ళు. కళ్ళు సరిగా కనిపిస్తేనే మనం ఏ పనినైనా చేయగలం. ఏమైనా చూడగలం. అవి సరిగా కనిపించకపోతే మనకి ప్రపంచమంతా చీకటిగా కనిపిస్తుంది. కాబట్టి కళ్ళు బాగా కనపడాలని కొన్ని ఆహార పదాలను తీసుకుంటూ ఉంటాం.కంటి చూపు పెరగాలని అందరూ అనుకుంటారు కదా. కానీ కంటిచూపు పెరగాలని కొన్ని ఆహార పదార్థాలన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రమాదం. మరి దాని గురించి తెలుసుకుందాం.. శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ ఏ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది నేరుగా మన కళ్ళను ప్రభావితం చేస్తుంది.
విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారం తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే రేచీకటి యొక్క సమస్య కూడా తొలగిపోతుంది. అయితే విటమిన్ ఏ ఆధారత ఆహారాన్ని అధికంగా తీసుకోవడం కూడా చాలా ప్రమాదకరమని అనేక పరిశోధనల లో తేలింది. మరి అవి ఏంటో తెలుసుకుందాం.. విటమిన్ ఏ లోపం ఉన్నవారు బత్తాయి ,బొప్పాయి, పెరుగు, సోయాబీన్, గుడ్డు, పాలు, క్యారెట్, పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవాలి. కానీ దీనికి కూడా ఒక పరిమితి ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి కొన్ని నష్టాలు జరుగుతాయి. విటమిన్ ఏ కళ్ళకు మంచిదే అయినప్పటికీ పరిమితికి మించి తీసుకుంటే కళ్ళు అస్పష్టంగా కనిపిస్తాయి.
అధిక మొత్తంలో విటమిన్ ఆహారం కారణంగా డయేరియా వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. అందువల్ల డైజేషన్ సలహా పై పరిమితంగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు కీళ్లలో నొప్పి వస్తుంది. మహిళల్లో విటమిన్ ఎక్కువగా ఉంటే మంచిది. వృద్ధులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మహిళల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే ఇది క్రమ రహిత పీరియడ్స్ కారణమవుతుంది. ఏదైనా అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే అలసట, బలహీనత, సమస్యలు ఎదురవుతాయి. జుట్టు బలహీనంగా మారుతుంది. కాబట్టి ఏ ఆహార పదార్థాలైనా కూడా మితంగా తీసుకోవడమే మంచిది…