Diabetes : మధుమేహం బాధితులు ఈ పప్పులు తీసుకోవడం మంచిదేనా.? ఈ పప్పులలో ఎంతవరకు సాధారణ ఇన్సులిన్ ఉంటుందో తెలుసా…
Diabetes : ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్లో వయసు తరహా లేకుండా చాలామంది ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి రోజురోజుకీ ఎక్కువవుతుంది. కొందరి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ వ్యాధికి కొన్ని రకాల ఇంగ్లీష్ మందులు వాడిన కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉండడం లేదు, అయితే వీటికి కొన్ని కారణాలు ఫుడ్ ను టైం టు టైం తీసుకోకపోవడం, సరైనటువంటి నిద్ర లేకపోవడం, ఎక్కువగా ఈ వ్యాధి రావడానికి కారణమవుతున్నాయి. ఈ వ్యాధి చాలా వేగంగా పెరిగిపోతుంది. ప్యాంక్రియాస్, ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపినప్పుడు లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాస్ట్ గా పెరిగినప్పుడు మధుమేహం వస్తుంది. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఈ ఇన్సులిన్ ని ఉత్పత్తి అవసరం, దీనిని ఉత్పత్తి చేయడానికి మందులు మాత్రమే వాడడం, కాకుండా సహజంగా ఇన్సులిన్ కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు.
మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల పప్పులను తినడం వలన, మీకు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని సాధారణంగా పెంచుకోవచ్చు. అలాంటి మూడు పప్పులు ఏంటో వాటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. డయాబెటిక్ ను ఈ పప్పులు ఎలా కంట్రోల్ చేస్తాయి. ఈ పప్పులలో ఫైబర్, ప్రోటీన్స్, కాంప్లెక్స్, కార్బోహైడట్లు ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ పప్పులలో ఉండేటువంటి అధిక మొత్తం ఫైబర్ షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను కూడా మెరుగు పరుస్తాయి. శనగపప్పు: ఈ పప్పు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో పోలిక్ యాసిడ్ సరి అయిన ప్రోటీన్ ఉంటుంది.
ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిలో ఉండే పోషకాలు ఎర్ర రక్త కణాలును సమకూరుస్తాయి. పెసరపప్పు: ఈ పప్పు షుగర్ కంట్రోల్ లో ఉంచడంలో ఈ పెసరపప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పప్పులో గ్లైస్మిక్ ఉంటుంది. కాబట్టి ఈ పప్పును మీరు తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పప్పులో ఐరన్, మెగ్నీషియం, కాపర్ లాంటి బలవర్ధకమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోని నీరసమును తగ్గించి షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. కందిపప్పు: ఈ పప్పులో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం వలన, షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పప్పు శరీరానికి కావలసినంత శక్తినిస్తుంది. అలాగే మధుమేహం వ్యాధులకు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో ఈ పప్పులు బాగా ఉపయోగపడతాయి.