Hypothermia Symptoms : ఈ చలికాలంలో జలుబుతో పాటు వణుకు వస్తే వెరీ డేంజరస్..అప్పుడు ఏం చేయాలంటే?
Hypothermia Symptoms : జనరల్‌గా చలి కాలంలో చలి ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చలిని తట్టుకునేందుకుగాను ప్రతీ ఒక్కరు స్వెట్టర్స్ ధరించడంతో పాటు ఇంటి నుంచి బయటకు రారు. అవసరమైతేనే బయటకు వచ్చి తమ పనులు చేసుకుంటారు. అలా చలి కాలంలో జాగ్రత్తగా తమ పనులు చేసుకుంటారు ప్రజలు. ఈ సంగతులు అలా ఉంచితే.. చలికి జనం వణుకుతుంటారు. అది సాధారణమే. కానీ, జలుబు విపరీతమై శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వచ్చి వణుకుడు పుడితే మాత్రం చాలా ప్రమాదం.. అప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చిందంటే చాలు..
శరీరంలో మార్పులు జరిగినట్లే అని భావించాలి. అలా శ్వాస ఇబ్బంది వచ్చిందంటే. శరీరం అపస్మారక స్థితికి చేరుకునే చాన్సెస్ ఉంటాయి. అలా బాడీ హీట్ కంప్లీట్‌గా తగ్గిపోతుంటుంది. దానిని అల్పోష్ణస్థితి అంటారు. అనగా వెరీ లెస్ టెంపరేచర్ అని అర్థం.దాని వల్ల హ్యూమన్ బాడీలోని పార్ట్స్ ఏవి కూడా పనిచేయవు. ఫలితంగా ప్రాణాంతక పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. అటువంటి ఇబ్బంది కర పరిస్థితులు వచ్చినపుడు ఏం చేయాలంటే…బాడీని కంప్లీట్‌గా కవర్ చేసుకోవాలి. ముఖ్యంగా చెవులు, మెడ, చేతులు, కాళ్లు బయటి ఎన్విరాన్‌మెంట్‌లో ఎక్స్ పోజ్ కాకుండా క్లోత్స్ ధరించాలి.
Hypothermia Symptoms : ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు..
బాగా కష్టపడి పని చేయొద్దు. చెమట బాగా వచ్చేలా అస్సలు పనిచేయొద్దు. అలా చేయడం వలన శరీర ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇకపోతే శీతాకాలంలో లూజ్ దుస్తులు ధరించొద్దు. టైట్ ప్లస్ మందం ఉండే వస్త్రాలను ధరించాలి. అలా అయితేనే శరీరంలోనికి గాలి నేరుగా వెళ్లబోదు. ఇకపోతే తడి వస్త్రాలను అస్సలు ధరించొద్దు. అలా అయితే కనుక మీకు చలి ఇంకా ఎక్కువవుతుంది. బయటకు వెళ్లే టైంలో మీ చేతులు, కాళ్లకు గ్లౌజులు తొడుక్కోవడం చాలా మంచిది. ఇకపోతే చిన్న పిల్లలను చలి కాలంలో బయట తిరగ నీయొద్దు. వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినిపించాలి. చల్లటివి దూరంగా ఉంచాలి.