Health Benefits : ప్రతిరోజు పచ్చిమిర్చిని తింటే ఏమవుతుందో తెలుసా ..?
Health Benefits : కొంతమంది ప్రతిరోజు తినే ఆహారంలో పచ్చిమిర్చిలను చేర్చుకుంటారు. అయితే పచ్చిమిర్చి వలన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. కొందరు పచ్చిమిరపకాయలు తింటే గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయని వాటిని తినడానికి వెనకాడుతారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి, బి6 ఉంటాయి. అలాగే క్యాప్సైసిన్, కెరోటిన్, క్రిప్టోక్సంటిన్, లూటీన్ జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. అలాగే అమైనో ఆమ్లాలు, ఫోలిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి జీర్ణ సంబంధిత ఎంజైములను పెంచుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.హై బీపీ ఉన్నవారు పచ్చిమిర్చి తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. పచ్చిమిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దానిలోని సిట్రిక్ యాసిడ్ రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది హైబీపీని నియంత్రిస్తుంది. పచ్చిమిరపకాయలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు అలసిపోతారు. ఇలాంటివారు ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ వంటి పోషకాలు ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది.పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మిరపకాయ తినడం వలన రక్తం శుభ్రం అవుతుంది. ప్రతిరోజు పచ్చిమిర్చిని తీసుకోవడం వలన రక్త ప్రసరణ సమతుల్యంగా ఉంటుంది. పచ్చిమిరపకాయల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్ ఆస్ట్రో ఆర్థరైటిస్ రోగులకు బాగా పనిచేస్తుంది. ఇది ఎముకలలో వాపు, నొప్పిని తగ్గిస్తుంది. పచ్చిమిరపకాయలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది.