Bitter Gourd : గర్భధారణ సమయంలో బోడ కాకరకాయలను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రధానాంశాలు:
Bitter Gourd : గర్భధారణ సమయంలో బోడ కాకరకాయలను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
Bitter Gourd : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనారోగ్యాలకు కొదవే ఉండదు. అయితే ఈ కాలంలో దొరికే బోడ కాకరకాయలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. చాలామంది షుగర్ తో బాధపడుతూ ఉంటారు. షుగర్ అదుపులో ఉంచుకోకపోతే అది గుండె, మూత్రపిండాలు వంటి శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. మధుమేహం కంట్రోల్ లో ఉండాలంటే మందులతో పాటు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి అటువంటి ఆహారాన్ని బోడ కాకరకాయలను మీ ఆహారంలో చేర్చుకోండి వాటిని తీసుకోవడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. ఇక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న బోడ కాకరకాయ లేదా ఆకాకరకాయ ఎన్నో వ్యాధులను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ బోడ కాకరకాయని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారట. ఈ బోడ కాకరకాయ తీసుకోవడం వలన బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది.అలాగే మెమరీ పవర్ పెరగాలన్న బ్రెయిన్ హెల్త్ ని మైంటైన్ చేయాలనా మనం రెగ్యులర్గా దీన్ని డైట్లో ఆడ్ చేసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇన్సులిన్ ని ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. జనరల్ గానే డయాబెటిక్ పేషెంట్స్ కి కాకరకాయ జ్యూస్ డైట్లో తీసుకోమంటారు. చేదుగా ఉంటది కాబట్టి కొంచెం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈ ఆకాకరకాయ అనేది చేదు ఉండదు.
దీన్ని డైట్ లో యాడ్ చేసుకోవడం డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది. ప్రతి రోజు బోడ కాకరకాయల్ని తీసుకుంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి న్యాచురల్ గా తగ్గుతాయి. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి.
ఈ ఎందుకంటే ఈ ఆకాకరకాయలో పోలేట్స్ ఎక్కువగా ఉంటాయి. గర్భాదారణ సమయంలో ఈ ఆకాకరకాయను మీ ఆహారంలో చేర్చుకున్నట్లైతే తల్లికి బిడ్డకి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి బిడ్డ ఎదుగుదలకు ఈ బోడ కాకరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే బీటా కేరోటిన్ లీవ్ టీన్ చర్మ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బొడ కాకరకాయలో అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ కొవ్వు కార్బోహైడ్రేట్లు ఇంకా అలాగే ఆస్కార్బిక్ యాసిడ్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇక ఈ పోషకాలాన్ని కూడా ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే స్త్రీల సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ కూరగాయ చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది. ఈ బోడ కాకరకాయలను తీసుకోవడం ద్వారా మధుమేహం కచ్చితంగా అదుపులో ఉంటుంది. వర్షాకాలంలో దొరికే ఈ బోడ కాకరకాయ మధుమేహ రోగులకు కూడా బాగా మేలు చేస్తుంది. ఇది నరాల లోపాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది..