Health Tips : ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే…!!
Health Tips : చాలామంది ఆహారం తిన్న వెంటనే స్నానం చేసేస్తూ ఉంటారు.. అయితే ఈ విధంగా స్నానం చేస్తే కొన్ని చెడు ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. అయితే తాగే నీళ్లు, తినే ఆహారం పండ్ల రసాలకు సంబంధించిన రకాల సూచనలు సలహాలు పెద్దలు సూచిస్తూ ఉంటారు. ఆహార నియమాలకు సంబంధించి తరతరాల నుంచి కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. వాటిని మన ఇళ్లల్లో పెద్దలు ఇప్పటికి కూడా మనకి చెప్తూనే ఉంటారు. పాలల్లో ఉప్పు కలిపి తీసుకోకూడదు. టీ తాగిన తర్వాత నీటిని తాగకూడదు. ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. అని మన పెద్దలు ఇప్పటికీ మనకి చెప్తూనే ఉంటారు. అయితే చాలామంది తిన్న వెంటనే స్నానం ఎందుకు చేయకూడదు అని కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే అసలు ఆహారానికి స్నానానికి ఎటువంటి సంబంధం ఉంది. అని చాలామంది ఆలోచిస్తున్నారు. మరి ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆహారం తిన్న వెంటనే స్నానం ఎందుకు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం… బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉండాలి.. మీరు ఎప్పుడైనా భోజనం చేసి,న భోజనంజీర్ణం కావడానికి చాలా శక్తి రక్త పోటు అవసరం అయితే తిన్న తర్వాత స్నానానికి వెళ్తే అప్పుడు బిపి తక్కువ అవుతూ ఉంటుంది. దాంతో ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఈ మూలంగా ఆహారం తిన్నా వెంటనే స్నానం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఆహారం తినడానికి స్నానానికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు..
నిజమెంత : ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయకూడదని చెప్పి శాస్త్రీయా ఆధారాలు ఏమీ లేవని చాలా పరిశోధనలలో బయటపడింది. కొన్ని పరిశోధనలు స్నానం చేయడం వల్ల తాజాగా శక్తివంతంగా అనుభూతి చెందుతారని ఇది మీ శరీరంపై సానుకూల ఎఫెక్ట్ పడుతుందని చెప్తుంటారు. అయితే తిన్న వెంటనే తలస్నానం చేయడం వల్ల రక్తపోటు తగ్గిపోతుందని దీనివలన తల తిరగడం లేదా కళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కావున ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయడానికి ముందు కాసేపు ఆగి తరవాత స్నానం చేయడం చాలా మంచిది. ప్రధానంగా రక్తపోటు తక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు కూడా తిన్న తర్వాత స్నానం చేయడం అస్సలు మంచిది కాదు..