Honey : తేనెను ఇలా అస్సలు తినకండి… విషం తో సమానం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Honey : తేనెను ఇలా అస్సలు తినకండి… విషం తో సమానం…!

 Authored By ramu | The Telugu News | Updated on :14 August 2024,6:00 am

Honey : తేనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసినదే. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే. తేనెను సరిగ్గా ఎలా తినాలి అనే విషయం చాలా మందికి తెలియదు. కొన్ని రకాల ఫ్రూట్స్ తో తేనెను కలుపుకొని తీసుకుంటే ఎంత మంచిదో ఇంకొన్ని ఫ్రూట్స్ తో తేనెను కలిపి తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. అయితే ఈ తేనెను ఎలా తీసుకోవాలి మరియు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…

Honey  నట్స్ తో కలిపి తీసుకోవటం

తేనెని డైరెక్టుగా కూడా తీసుకోవచ్చు. కానీ ఎంత పరిమితిలో తినాలి అనే విషయం తెలుసుకోవాలి. అలాగే నట్స్ తో కలిపి తీసుకోవటం కూడా చాలా మంచిది. అయితే బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ తో కలిపి తేనేను తీసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెండిటి కలయిక వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది…

పండ్లతో : నిజంగా పండ్లతో తేనెను కలిపి తీసుకోవటం కూడా మంచి అలవాటు అని చెప్పొచ్చు. అయితే ఈ తేనెను సిట్రస్ ఫ్రూట్స్ తో కాకుండా పాములుగా మీరు తీసుకునే పండ్లతో తేనేను కలిపి తీసుకోండి. ఆ రెండిటి కాంబినేషన్ కి మీరు ఖచ్చితంగా ఫిదా అవుతారు…

కార్న్ ఫ్లెక్స్ : మీరు ఒక బౌల్లో కార్న్ ఫ్లెక్స్ తీసుకొని దానిలో కొద్దిగా హాని వేసుకొని తీసుకోండి. అలాగే వీటిని ఉదయాన్నే తీసుకున్నట్లయితే మంచి బ్రేక్ ఫాస్ట్ లా కూడా ఉంటుంది. అంతేకాక ఇది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని తీసుకున్న తర్వాత మీకు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక నశిస్తుంది…

తేనెను ఇలా అస్సలు తినకండి : ఇప్పటివరకు మనం తేనెను ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు తేనే ను ఎలా తినకూడదో తెలుసుకుందాం. అయితే చాలామందికి ఈ విషయాలు తెలియక తేనెలో ఉన్న గుణాలు సరిగ్గా పొందలేకపోతున్నారు. అవి ఏంటి అనేది ఇప్పుడు మనకు తెలుసుకుందాం…

వేడి చేయడం : తేనెను వేడి చేయకూడదు అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ తేనెను వేడి చేయటం వల్ల దానిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ పోతాయి. మీరు గనక తేనెని వేడి చేసినట్లయితే అప్పుడు దానిలో ప్రక్టోజ్ మరియు సుక్రోజ్ లు డిహైడ్రేడ్ అయ్యి హైడ్రోక్సిమిథైల్పురాల్ గా మారతాయి. ఇవి బాడీలో టాక్సిసిటీని పెంచుతాయి. అనగా బాడీలో విషాన్ని పెంచుతాయి అన్నమాట. ఇది మీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఈ తరుణంలోనే ఉదయాన్నే వేడి నీటిలో తేనెను కలుపుకొని తాగేవారు నీళ్లు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి…

నెయ్యితో కలపటం : ఆయుర్వేద పండితులు చెప్పిన ప్రకారం చూస్తే,నెయ్యిలో తేనెను కలవడం అనేది అసలు మంచిది కాదు. అవి రెండింటిని సమాన మోతాదులో తీసుకోవడం అసలు మంచిది కాదు. మరి అవసరం అయినట్లయితే తేనే ను 2 వంతులు ఒక వంతు నెయ్యి వేసుకొని తీసుకోండి. దీనిని కూడా అధిక సార్లు తీసుకోవటం మంచిది కాదు అని అంటున్నారు…

ముల్లంగి : అలాగే ఈ ముల్లంగితో కూడా తేనే ను కలిపి తీసుకోవటం అసలు మంచిది కాదు అని అంటున్నారు. మనం సలాడ్ ను చేసుకున్నప్పుడు ముల్లంగి మరియు తేనే ను కలిపి అసలు తీసుకోకూడదు అని అంటున్నారు. అంతేకాక ఈ ముల్లంగిని పాలతో కూడా కలిపి తీసుకోవటం మంచిది కాదు. ఎందుకు అంటే. ఈ ముల్లంగిలో ఎరిత్రోబిక్ మరియు మలోనిక్, మాలిక్ ఆక్సలిన్ అనే యాసిడ్లు ఉంటాయి. కావున ఈ తేనెను పాలుతో కలిపి తీసుకోవటం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు.

Honey తేనెను ఇలా అస్సలు తినకండి విషం తో సమానం

Honey : తేనెను ఇలా అస్సలు తినకండి… విషం తో సమానం…!

నాన్ వెజిటేరియన్స్ : నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే,కొన్ని నాన్ వేజ్ డిసెష్ ను తేనెతో కలిపి తీసుకుంటే మంచిదే. కానీ కొన్నిటిని మాత్రం అసలు కలపకూడదు. అయితే చేపలు లాంటి వాటిని అసలు తేనే లో కలిపి తీసుకోకూడదు. అయితే ఈ కాంబినేషన్ గురించి కొన్ని సూచనలు మాత్రమే ఉన్నాయి. వీటి యొక్క ఆధారాలు ఇంకా తెలియలేదు. వీటిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ తేనే ను ఆరోగ్యం కోసం సరైన పద్ధతిలో మాత్రమే తీసుకోవటం మంచిది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది