Tulsi Kashayam : ఉదయాన్నే పరగడుపున తులసి కషాయం తాగితే అన్ని వ్యాధులకి చెక్…!!
Tulsi Kashayam : మన హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకులతో మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తులసిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, సోడియం, ఆస్కార్బిక్ ఆమ్లం, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. వీటి వల్ల రక్త వృద్ధి, గుండెకు బలం, ఎముకలు గడ్డితనం, గుండెపోటు రాకుండా గాయాలు మానేందుకు చర్మ సౌందర్యానికి అవయవాల పెరుగుదలకి ,గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ తులసి ఆకులు ఉపయోగపడతాయి. మానసిక పెరుగుదల లేని పిల్లలకి తులసి రసం తేనెతో తీసుకుంటే 20 రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.
మనకి ప్రతిరోజు పనులు ఒత్తిడి వల్ల సంభవించే మానసిక ఒత్తిడి లకు తులసి ఆకులు నమిలి తినటం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుంది. మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 20 గ్రాముల అల్లపురసము మరియు అదేవిధంగా సమానంగా తులసి రసం తేనే కొద్దిగా కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ప్రతిరోజు 15 నుండి 20 తులసి ఆకులు నమిలి మింగిన కడుపునొప్పి పోతుంది. చిన్నపిల్లలకు కడుపులో క్రిములు ఉన్నప్పుడు తులసి రసము కొద్దిగా వేడిచేసి మిరియాల చూర్ణంతో కలిపి తీసుకున్న తాజాగా ఉన్న తులసి ఆకులు ఐదు మరియు మిరియాలు నాలుగు కలిపి పరగడుపున వారానికి రెండు సార్లు తీసుకుంటే చలి జ్వరం అసలు దరి చేరదు.
తులసి ఆకుల రసమును కొంచెం రోజుకి రెండు లేదా మూడుసార్లు తీసుకున్న దగ్గు దగ్గుతుంది. జలుబు చేసిన వాళ్ళు రోజుకి 35 నుండి 45 ఆకులు తింటుంటే జలుబు పూర్తిగా నయమవుతుంది. ఉదయం తులసి ఆకులు నమిలినా దంతములు తోమిన దంత సమస్యలు ఉండవు. మరియు దంతములు తెల్లగా అవుతాయి. తాజా తులసి ఆకుల రసముకు యాలకుల చూర్ణం కలిపి తీసుకున్న వాంతులు తగ్గుతాయి. తులసి విత్తనాలను తమలపాకు తీసుకుంటే వీర్య వృద్ధి కలుగుతుంది. తులసి ఆకులను మెత్తగా నూరి శరీరానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లలో స్నానం చేస్తే చర్మపు వ్యాధులు నయం అవుతాయి. ఇవే కాక తులసి అనేక విధాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుంది..