Tulasi Water : ఉదయాన్నే పరగడుపున తులసి కషాయం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tulasi Water : ఉదయాన్నే పరగడుపున తులసి కషాయం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!

Tulasi Water ; తులసికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. తులసి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. గోరు వెచ్చని నీళ్లల్లో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదుజీర్ణ క్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. తులసి రసంలో తేనె కలుపుకొని […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 January 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Tulasi Water : ఉదయాన్నే పరగడుపున తులసి కషాయం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

Tulasi Water ; తులసికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. తులసి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. గోరు వెచ్చని నీళ్లల్లో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదుజీర్ణ క్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయని అంటున్నారు. అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.

పొట్టలో ఉండే నులి పురుగులు నసిస్తాయి.. జలుబులు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్ స్పూన్ తో తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గుముఖం పడతాయని నిపుణులు వాపోతున్నారు. అంతేకాకుండా తులసి ఆకులు జ్వరాన్ని తగ్గిస్తుంది. అల్సర్ల నుండి రక్షిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది. కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది.

నోటి నుండి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.అలర్జీలు, పొగ ,దుమ్ము నుండి శరీరానికి కలిగే హానిని అరికడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. దాదాపు అందరూ ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్క ఉంటుంది. ఎందుకంటే తులసాకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంత పరుచుకొని మంచి యాంటీబయోటికగా పని చేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని నమ్మకం.. అందుకే చాలా దేవాలయాలలో తీర్థంలో తులసి దళాలను వేసిస్తారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది