Dry Grapes : ఎండు ద్రాక్ష ఉదయాన్నే తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే…!
ప్రధానాంశాలు:
Dry Grapes : ఎండు ద్రాక్ష ఉదయాన్నే తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే...!
Dry Grapes : ద్రాక్ష పండ్లను ఎండబెట్టి తయారు చేసే ఎండుద్రాక్ష అంటే చాలామందికి ఇష్టమే. వీటిని కూడా కిస్మిస్ లు అని పిలుస్తారు. వీటిని ఎక్కువగా స్వీట్లు తీపి వంటకాల తయారీలో అందరూ ఉపయోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్షలను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టి వాటిని ఉదయాన్నే తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయట. ప్రధానంగా పలు రకాల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది రక్తహీనతను నివారిస్తుంది..
విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండడం వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. 10 రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా అమ్మాయిలకు ఇంకా మంచిది. ఎందుకంటే మహిళల్లో అనేకమందికి రక్తహీనత సమస్య ఉంటుంది. అలాగే వారు రోజు ఎండు ద్రాక్ష తినడం అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇందులో ఇనుము, విటమిన్ బి, రాగి పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాల పుట్టుకను పెంచడానికి ఇవి దోహదపడతాయి. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా ఎండు ద్రాక్ష తినొచ్చు.
వీటిని కొంచెం తింటే చాలు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దానివల్ల తక్కువ తింటారు. పిల్లలకు రోజు ఉదయం టిఫిన్ సమయంలో వీటిని తినడం అలవాటు చేయాలి. ఇందులో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు గట్టి పడతాయి. ఎండుద్రాక్ష లోక నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నోటి దుర్వాసన తగ్గడానికి ఎండుద్రాక్షను నోట్లో వేసుకుని నములుతూ ఉంటే ఫలితం ఉంటుంది. చిగుళ్ళ సమస్యకు కూడా దీంతో చెక్ పెట్టొచ్చు..