Garika : పల్లెల్లో కనిపించే గరిక.. నిర్లక్ష్యానికి గురైన ఈ గడ్డి వెనుక దాగిన ఆరోగ్య రహస్యాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garika : పల్లెల్లో కనిపించే గరిక.. నిర్లక్ష్యానికి గురైన ఈ గడ్డి వెనుక దాగిన ఆరోగ్య రహస్యాలు

 Authored By ramu | The Telugu News | Updated on :11 January 2026,7:00 am

ప్రధానాంశాలు:

  •  Garika : పల్లెల్లో కనిపించే గరిక.. నిర్లక్ష్యానికి గురైన ఈ గడ్డి వెనుక దాగిన ఆరోగ్య రహస్యాలు

Garika : పల్లెటూర్లలో ఇళ్ల చుట్టూ, పొలాల అంచుల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే గరిక గడ్డిని చాలామంది పనికిరానిదిగా భావించి పట్టించుకోరు. కొందరైతే దాన్ని చెత్తగా తీసిపారేస్తారు కూడా. కానీ అదే గరికలో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మతపరంగా పవిత్రంగా భావించే ఈ గడ్డి ఆరోగ్య పరంగా కూడా ఎంతో ఉపయోగకరమని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాధారణంగా పశువుల మేతగా ఉపయోగించే గరిక మన దైనందిన జీవనశైలిలో భాగం చేసుకుంటే అనేక వ్యాధులకు సహజ ఔషధంగా పనిచేస్తుందట. గరికకు భారతీయ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా గణేశుడి పూజలో గరికను అత్యంత పవిత్రంగా భావిస్తారు.

Garika పల్లెల్లో కనిపించే గరిక నిర్లక్ష్యానికి గురైన ఈ గడ్డి వెనుక దాగిన ఆరోగ్య రహస్యాలు

Garika : పల్లెల్లో కనిపించే గరిక.. నిర్లక్ష్యానికి గురైన ఈ గడ్డి వెనుక దాగిన ఆరోగ్య రహస్యాలు

Garika : నిర్లక్ష్యానికి గురైన ఈ గడ్డి వెనుక దాగిన ఆరోగ్య రహస్యాలు

వినాయక చవితి వంటి పర్వదినాల్లో గరిక లేకుండా పూజ పూర్తికాదనే భావన ఉంది. అంతేకాకుండా పిండప్రదానాలు, శ్రాద్ధకర్మల్లో కూడా గరికను ఉపయోగిస్తారు. ఇది శుభప్రదమైనదిగా పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. ఇలా మతపరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న గరిక, కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా శరీరానికి మేలు చేసే గుణాలతో కూడా నిండి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. గరికలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఎసిటిక్ యాసిడ్ వంటి గ్లూకోసైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గరికను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడటంలో ఇది సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గరిక జ్యూస్ తాగితే శరీరానికి తక్షణ శక్తి లభించి, అలసట తగ్గుతుందంటున్నారు నిపుణులు. అలాగే ఇది రక్తశుద్ధికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

 

గరికలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వాపులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఎక్కడైనా లోపలి వాపులు, చిన్న గాయాలు, ఇన్ఫెక్షన్లు ఉంటే గరిక సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు జీర్ణ సమస్యలకు కూడా ఇది మంచి పరిష్కారం. గరిక జ్యూస్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే గరికలోని క్రిమినాశక గుణాలు చర్మానికి సహజ మెరుపు అందించి, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇలా చూస్తే పల్లెల్లో నిర్లక్ష్యానికి గురయ్యే గరిక గడ్డి నిజానికి ఆరోగ్యానికి వరంగా చెప్పుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది