Diabetes : ప్రతిరోజు ఈ ఆకును నమిలితే… డయాబెటిస్ పారార్..!
ప్రధానాంశాలు:
Diabetes : ప్రతిరోజు ఈ ఆకును నమిలితే... డయాబెటిస్ పారార్..!
Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పనిలో ఒత్తిడి, ఆందోళన ఇలా ఎన్నో కారణాల వలన డయాబెటిస్ తో బాధపడేవారు చాలామంది ఉన్నారు. డయాబెటిస్ ఉన్నవారు జీవనశైలిని మార్చుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తినే ఆహారంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. డయాబెటిస్ నియంత్రణలో తినే ఆహారం కీలకపాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. అయితే డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచే ఆకు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్న వారిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డయాబెటిస్ అనేది గుండె, ప్రాంక్రియాస్, కిడ్నీ మొదలైన అవయవాల మీద ప్రభావాన్ని చూపుతోంది. అయితే డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి మారేడు ఆకు బాగా సహాయపడుతుంది. మారేడు ఆకును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో చక్కెరను నిరోధించే గుణాలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించడంలో మరియు కొలెస్ట్రాల్ సాయిలను తగ్గించడం సహాయపడుతుంది. మారేడు ఆకులో హైపోగ్లైసిమిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
ఇవి డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ప్యాంక్రియాస్ గ్రంధిని బలపరుస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రతిరోజు ఉదయం 3 మారేడు ఆకులను నమిలి మింగాలి. లేదంటే మారేడు ఆకులను జ్యూస్ లా చేసుకుని త్రాగాలి. చక్కెర వ్యాధి ఉన్నవారు ఎక్కువగా ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు మొదలైన వాటిని ఆహారంలో తీసుకోవాలి. ఇలా ఆహార నియమాలను పాటిస్తూ ప్రతిరోజు మారేడు ఆకును నమిలితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.