Eating Snails : నత్తలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటే నమ్ముతారా… కానీ ఇది నిజం… ఎలాగో తెలుసుకోండి…!
Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అలాగే నత్తల తో తయారు చేసే కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఇది గోదావరి నది ఒడ్డున ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఎక్కువగా నాన్ వెజ్ తినేవారికి వీటి గురించి బాగా తెలుసు. వీటితో చేసే వంట కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే పలు రకాల ఫేమస్ రెస్టారెంట్లలో […]
ప్రధానాంశాలు:
Eating Snails : నత్తలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటే నమ్ముతారా... కానీ ఇది నిజం... ఎలాగో తెలుసుకోండి...!
Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అలాగే నత్తల తో తయారు చేసే కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఇది గోదావరి నది ఒడ్డున ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఎక్కువగా నాన్ వెజ్ తినేవారికి వీటి గురించి బాగా తెలుసు. వీటితో చేసే వంట కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే పలు రకాల ఫేమస్ రెస్టారెంట్లలో కూడా నత్తలతో వంటకాలు తయారు చేస్తారు. నత్తలతో వ్యాపారం చేసేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే వీటి గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు. కానీ మీ ఇంట్లో పెద్ద వాళ్లకు మాత్రం ఈ నత్తల కూర గురించి తెలిసే ఉంటుంది. ఈ నత్తలతో తయారుచేసిన కర్రీ ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది…
వర్షాలు పడినప్పుడు ఎక్కువగా దొరుకుతాయి : ఈ నత్తలనేవి మనకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కేవలం వర్షాలు పడిన తర్వాత మాత్రమే ఇవి మనకి ఎక్కువగా దొరుకుతాయి. అయితే ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలలో ఈ నత్తలను ప్రత్యేకంగా పెంచుతూ ఉంటారు. అలాగే ఈ నత్తలతో వెరైటీ వంటకాలను కూడా తయారు చేస్తారు. ఈ నత్తలను పేదవారి మాంసంగా కూడా చెబుతూ ఉంటారు…
వీరికి బెస్ట్ : కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు నత్తలు తినడం వలన సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే శ్వాస కోసం సమస్యలతో ఇబ్బంది పడే వారు మరియు ఫైల్స్ సమస్యతో బాధపడే వారు కూడా ఈ నత్తలను తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నత్తలను తినడం వలన గుండెకు కూడా ఎంతో మేలు జరుగుతుంది అని పలు అధ్యయనంలో కూడా తేలింది…
నత్తలలో పోషకాలు : ఈ నత్తలలో అధిక శాతం అనగా 82 శాతం వరకు నీరే ఉంటుంది. దీనిలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, నియాసిన్, సెలీనియం లాంటివి అధిక మోతాదులో ఉంటాయి…
అతి తక్కువ ధరకే : నత్తల మాంసం అనేది ఎంతో మెత్తగా కూడా ఉంటుంది. అయితే మేక మాంసం కంటే కూడా ఈ నత్తల కర్రీ చాలా రుచిగా ఉంటుందంట. అలాగే గర్భిణీలు మరియు చిన్నపిల్లలు,రక్తహీనత సమస్యతో బాధపడే వారు కూడా నత్తలను తీసుకుంటే చాలా మంచిది. అంతేకాక ఇవి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అంతేకాక నత్తలను తీనడం వలన కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు…